ప్లీజ్ పెళ్లి గురించి అడగొద్దు అంటున్న శృతి హాసన్...!!
విశ్వ నటుడు కమల్ హాసన్ కూతురు మరియు స్టార్ హీరోయిన్ శృతి హాసన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు తన నటనతో మంచి గుర్తింపు సాధించిన శృతిహాసన్ అతి తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్ గా మారింది.. నటిగానే కాకుండా సింగర్ గా కూడా తనలో ఉన్న మరో యాంగిల్ ను కూడా చూపింది.ఇక సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా కనిపిస్తూ ఉంటుంది.ఈమె 2000 లో బాలనటిగా నటించింది . ఆ తర్వాత హీరోయిన్ గా మంచి గుర్తింపు ను తెచ్చుకుంది. 2010లో 'లక్' అనే సినిమాతో హీరోయిన్ గా బాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమయ్యింది. ఇక అనగనగా ఓ ధీరుడు సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి కూడా పరిచయం అయింది. అలా దాదాపు 20 సినిమాలలో అయితే నటించింది. తెలుగుతో, హిందీ తో పాటు తమిళ భాషలో కూడా నటించి అక్కడ కూడా మంచి గుర్తింపు ను తెచ్చుకుంది. ఇక తానే స్వయంగా పాటలు రాసి కంపోజ్ కూడా చేస్తుంది. బాలీవుడ్ లో తన పాటను వినిపించింది. చాలా వరకు స్టార్ హీరోల సినిమాలలో ఆమె నటించింది. ఇక వ్యక్తిగత విషయంలో శృతి హాసన్ చాలాసార్లు వార్తల్లో నిలిచింది.ఇక శృతి హాసన్ ప్రస్తుతం తన బాయ్ ఫ్రెండ్ శాంతా ను హజారికా తో సహజీవనం చేస్తున్న విషయం తెలిసిందే. తన బాయ్ ఫ్రెండ్ తో దిగిన ఫోటోలను మరియు వీడియోలను అభిమానులతో బాగా పంచుకుంటుంది. నిజానికి తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి ఆమె చేసే రచ్చ అంతా ఇంతా కాదు. ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా ఇద్దరు కూడా ఒకే ఇంట్లో ఉండటంతో అందరూ శృతిహాసన్ ను విమర్శించారు.
ఈ బ్యూటీ కి చాలాసార్లు తన పెళ్లి గురించి ప్రశ్నలు కూడా ఎదురయ్యాయి. ఇప్పటికీ ఈమె బయట కనిపిస్తే చాలు పెళ్లెప్పుడు అంటూ అడుగుతూనే ఉంటారని తెలుస్తుంది.. తాజాగా ఆమె తన సోషల్ మీడియా వేదికగా.. తన ఫాలోవర్స్ తో కాసేపు చాట్ చేసింది. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది. అయితే ఓ నేటిజన్ మాత్రం పెళ్లెప్పుడు చేసుకుంటారు అని అడగటంతో.. ఈ ప్రశ్న నాకు చాలా బోరింగ్ అంటూ షాకింగ్ సమాధానం అయితే ఇచ్చింది. ఈ ప్రశ్న ఇప్పటికి చాలాసార్లు విని విని నాకు బాగా బోర్ కొట్టేసింది అన్నట్లుగా సమాధానం అయితే ఇచ్చింది.