ఆహింస:ఈసారైనా చెప్పిన తేదీకి విడుదల చేస్తారా..?

Divya
డైరెక్టర్ తేజ చివరిగా నేనే రాజు నేనే మంత్రి సినిమా తో మంచి బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకున్నారు. ఇక ఈ సినిమా తర్వాత ఇప్పుడు అహింస అనే చిత్రంతో రానా సోదరుడు దగ్గుబాటి అభిరామ్ హీరోగా ఈ చిత్రంతో పరిచయం చేయబోతున్నారు. ఈ చిత్రాన్ని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమవుతున్నారు. అహింస సినిమా షూటింగ్ పూర్తి అయ్యి ఇప్పటికి చాలా కాలం అవుతున్న సరైన విడుదల తేదీ కోసం ఎదురుచూస్తున్నారు.

ఆనంది ఆర్ట్స్ క్రియేషన్ బ్యానర్ మీద పి కిరణ్ నిర్మించిన ఈ చిత్రానికి ఆర్పి పట్నాయక్ అద్భుతమైన సంగీతాన్ని అందించారు. దీంతో ఈ సినిమా టీజర్ ,ట్రైలర్ కూడా అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. ఈ చిత్రానికి సంబంధించి థియేట్రికల్ రిలీజ్ డేట్ ని కూడా ప్రకటించారు. ఈ చిత్రం వచ్చేనెల 7వ తేదీన సమ్మర్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలియజేయడం జరుగుతోంది. ఈ సినిమాలో ఉన్న పలు కీలకమైన విషయాలను చూపించే విధంగా ఒక పోస్టర్ని విడుదల చేయడం జరిగింది. అయితే ఈ సినిమా ఇప్పటికే 10 సార్లు వాయిదా పడినట్లుగా సమాచారం.

అందుకే ఈసారైనా ఈ సినిమా చెప్పిన తేదీకి వస్తుందా లేదా అనే విషయంపై చర్చ జరుగుతోంది. అభిరామ్ హీరోగా హీరోయిన్ గా గీతిక నటించింది. ఇక ఇందులో హీరోయిన్ సదా, రజత్ బేడి, కమల్ కామరాజు, మనోజ్ టైగర్ తదితరులు కీలకమైన పాత్ర లో నటించారు. దగ్గుబాటి కుటుంబం నుంచి లాంచ్ అవుతున్న హీరోగా అభిరామ్ ఈ సినిమాతో హిట్టు కొట్టాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక తన ఎంట్రీ బాధ్యత డైరెక్టర్ తేజ తీసుకోవడంతో విభిన్నమైన ప్రేమ కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. అభిమానులు అంత చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్న ఈ సినిమా ప్రేక్షకులను మెప్పిస్తుందో  లేదో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: