ప్రస్తుతం తమిళ మరియు తెలుగు సినిమా ఇండస్ట్రీలో వరుస సినిమా అవకాశాలను దక్కించుకుంటూ అద్భుతమైన క్రేజ్ ఉన్న నటుడి గా ఫుల్ జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తున్న సముద్ర ఖని గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నటుడి గా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న సముద్ర ఖని కొంత కాలం క్రితం తమిళం లో వినోదయ సీతం అనే మూవీ కి దర్శకత్వం వహించిన విషయం మన అందరికీ తెలిసిందే.
ఈ మూవీ తమిళం లో సూపర్ హిట్ విజయం అందుకుంది. తమిళం లో అద్భుతమైన విజయం అందుకున్న ఈ సినిమాను కొంత కాలం క్రితం తెలుగు లో కూడా విడుదల చేశారు. ఈ మూవీ కి తెలుగు లో కూడా సూపర్ రెస్పాన్స్ లభించింది. ఈ మూవీ ద్వారా సముద్ర కని దర్శకుడి గా తమిళ మరియు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక మంచి గుర్తింపు ను ఏర్పరచుకున్నాడు. ఇది ఇలా ఉంటే అద్భుతమైన విజయం సాధించి ప్రేక్షకుల నుండి ... విమర్శకుల నుండి ప్రశంసలను అందుకున్న వినోదయ సీతం సినిమాను అనేక మార్పులు ... చేర్పులు చేసి తెలుగు లో పవన్ కళ్యాణ్ రీమేక్ చేయబోతున్న విషయం మనకు తెలిసిందే.
ఈ మూవీ లో సాయి దరమ్ తేజ్ ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ మూవీ కి సముద్ర ఖని తెలుగు లో దర్శకత్వం వహించబోతున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ సినిమా ఒరిజినల్ లో ఎలాంటి పాటలు ఉండవు కానీ తెలుగు రీమిక్ లో మాత్రం రెండు పాటలు ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అందులో ఒకటి స్పెషల్ సాంగ్ కాగా ... మరొక పాట కూడా ఈ మూవీ లో ఉండబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇలా ఈ మూవీ ఒరిజినల్ తో పోలిస్తే తెలుగు రీమిక్ లో ఇలాంటి భారీ మార్పులు అనేకం ఉండబోతున్నట్లు సమాచారం.