మంగళవారం పోస్టర్.. అజయ్ మరోసారి అదరగొట్టేలా ఉన్నాడు..!
ఇక ఆ సినిమా తర్వాత ఏమాత్రం లేట్ చేయకుండా మరో ప్రాజెక్ట్ మొదలు పెడుతున్నాడు. అదే మంగళవారం. ఈ సినిమాలో స్టార్ కాస్ట్ ఎవరన్నది తెలియదు కానీ లేటెస్ట్ గా ఈ సినిమా కాన్సెప్ట్ పోస్టర్ ఒకటి వదిలాడు అజయ్ భూపతి. బటర్ ఫ్లై ఆకారంలో అమ్మాయి పక్కన రెక్కల్లో చాలా కళ్లు కనబడుతున్నాయి. చూస్తుంటే ఆరెక్స్ 100 తరహాలో మరో కొత్త కథతో అజయ్ భూపతి ఈ సినిమా చేస్తున్నాడని అర్ధమవుతుంది. టైటిల్ పోస్టర్ తోనే సినిమాపై క్రేజ్ వచ్చేలా చేసుకున్నాడు అజయ్ భూపతి. ఆరెక్స్ 100తో అతని డైరెక్షన్ టాలెంట్ కి చాలామంది ఫ్యాన్స్ అయ్యారు.
మహా సముద్రం సినిమా కూడా కొన్ని ఫ్యాక్టర్స్ లో బాగానే అనిపించినా కమర్షియల్ గా వర్క్ అవుట్ కాలేదు. ఫైనల్ గా మంగళవారంతో మరోసారి తన సత్తా ఏంటన్నది చూపించాలని ఫిక్స్ అయ్యాడు అజయ్ భూపతి. ఈసారి అజయ్ తన టార్గెట్ మిస్ అవకుండా సినిమా తెరకెక్కిస్తున్నాడని తెలుస్తుంది. మరి మంగళవారం ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతి అందిస్తుందో చూడాలి. మంగళవారం లో పాయల్ రాజ్ పుత్ నటిస్తుందని టాక్. ఒకవేళ అదే నిజమైతే మరోసారి ఆరెక్స్ 100 ని మించి రిజల్ట్ వస్తందని చెప్పొచ్చు.