గాయాల పాలైన హీరోయిన్ సమంత..!!

Divya
టాలీవుడ్ లో టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలుగుతోంది హీరోయిన్ సమంత. సమంత రియల్ లైఫ్ లో కూడ ఒక ఫైటర్ అని చెప్పవచ్చు. సమంత కెరీర్ ప్రారంభంలో అనేక గ్లామర్ పాత్రలలో నటించిన ఈ మధ్యకాలంలో పలు లేడీ ఓరియంటెడ్ చిత్రాలలో నటిస్తూ ఉంటోంది. గత కొన్నేళ్లుగా సమంత చేస్తున్న ప్రాజెక్టులను చూసుకుంటే వరుసగా విభిన్నమైన కథనాలతో కలిగి ఉంటాయని చెప్పవచ్చు. ఇక మరొకవైపు సమంత పలు వెబ్ సిరీస్లలో కూడా నటిస్తూ బిజీగా ఉంటోంది.

ది ఫ్యామిలీ మ్యాన్ -2 వెబ్ సిరీస్ తో మంచి పాపులారిటీ అందుకుంది. దీని ద్వారా ఓటీటి లోకి కూడా ఎంట్రీ ఇచ్చి రాజీ అని క్యారెక్టర్లలో అద్భుతమైన ఫైటర్ గా నటించింది. సమంత మెయిన్ లీడ్ పాత్రలలో నటించిన యశోద సినిమా విడుదలై గత ఏడాది మంచి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం సమంత లీడ్ రోల్ పాత్రలో నటించిన శాకుంతలం సినిమా త్వరలోనే విడుదలకు సిద్ధంగా ఉన్నది. ఈ సినిమా ఏడాది ఏప్రిల్ 14వ తేదీన విడుదల కాబోతున్నది. అలాగే విజయ్ దేవరకొండ తో కలిసి నటించిన ఖుషి సినిమా షూటింగ్ లో కూడా త్వరలో  సమంత పాల్గొనబోతున్నట్లు సమాచారం.

ఇక సమంత ఫ్యామిలీ మ్యాన్ దర్శకుడు తెరకెక్కిస్తున్న సీటాడేల్  రీమేక్ లో కూడా నటిస్తున్నది. ఇప్పుడు ఈ సిరీస్ షూటింగ్లో భాగంగానే సమంత గాయపడినట్లుగా తన ఇంస్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా తెలియజేయడం జరిగింది. ఇందులో సమంత చేతులకు చాలా గాయాలైనట్టుగా చూపించడం జరిగింది. ఈ ఫోటోలు చూసిన సమంత అభిమానులు సైతం సమంత త్వరగా కోలుకోవాలని పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. మరి ఈ విషయంపై సమంత పూర్తి వివరాలను తెలియజేస్తుందేమో చూడాలి మరి. ప్రస్తుతం సమంత కు సంబంధించి ఫోటోలు మాత్రం వైరల్ గా మారుతున్నాయి. సమంత ప్రస్తుతం హాలీవుడ్ లో కూడా నటిస్తున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: