పంజా వైష్ణవ్ సరసన ఉప్పెన సినిమాలో నటించిన హీరోయిన్ కృతి శెట్టి. తన మొదటి చిత్రంతోనే మంచి విజయాన్ని అందుకుంది ఈ ముద్దుగుమ్మ. అందం అభినయంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. తన పాత్రకు తగ్గ నటనతో ప్రేక్షకులకు బాగానే ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. అలా సినిమాలతో పాటు సోషల్ మీడియాలో కూడా కృతి శెట్టి యాక్టివ్గానే కనిపిస్తూ ఉంటుంది. ఇప్పటికే ఫ్యాన్స్ మీటుతో ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ అప్పుడప్పుడు బయట కూడా మెరుస్తూ ఫ్యాన్స్ కు సడన్ సర్ప్రైజ్ ఇస్తూ ఉంటుంది. తాజాగా ముంబైలో తన తండ్రితో కలిసి ఒక హోటల్ ను సందర్శించినట్లుగా తెలుస్తోంది.
వైట్ టాప్ బ్లూ జీన్స్ లో కృతీ శెట్టి మోడ్రన్ లుక్ అదిరిపోయేలా కనిపిస్తోంది. ఈ సందర్భంగా మీడియా కంటపడడం జరిగింది. దీంతో ఫ్యాన్స్ కు హాయ్ చెప్పి లోపలికి వెళ్ళింది ఈ ముద్దుగుమ్మ. ఇటీవలే సినిమాలో కంటే ఇలా బయట ఎక్కువగా కనిపిస్తూ సందడి చేస్తూ ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటూ ఉంటోంది. దీంతో అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. ఇక కెరియర్ విషయానికి వస్తే ఉప్పెన, శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు సినిమాలతో మంచి విజయాలను అందుకుంది. కానీ ఆ తర్వాత నటించిన సినిమాలన్నీ కూడా ఫ్లాప్ గా మిగిలాయి.
గడిచిన మూడు సినిమాలోతో ఫ్లాప్ గా నిలవడంతో కృతి శెట్టి గ్రాఫ్ పడిపోయిందని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే తదితర చిత్రాలలో దేవమ్మ హిట్ అందుకుంటుందేమో చూడాలి మరి ప్రస్తుతం కృతి శెట్టి నాగచైతన్య నటించిన కస్టడీ సినిమాలు నటిస్తోంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తి చేసుకున్నట్లు సమాచారం. ఈ చిత్రం పైన ప్రస్తుతం మీ ముద్దుగుమ్మ ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది అలాగే ఒక తమిళ సినిమాలో కూడా నటిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం కృతి శేట్టి కి సంబంధించి ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి