మహేష్ త్రివిక్రమ్ ల సినిమాకు మరో కొత్త సమస్య ?

Seetha Sailaja
‘అల వైకుంఠ పురములో’ మూవీ బ్లాక్ బష్టర్ హిట్ గా మారి మూడు సంవత్సరాలు దాటిపోయినా త్రివిక్రమ్ నుండి మరో సినిమా రాకపోవడం ఆయన అభిమానులను తీవ్రంగా నిరాశకు గురి చేస్తోంది. జూనియర్ త్రివిక్రమ్ ల మూవీ క్యాన్సిల్ అయిన తరువాత మహేష్ రంగంలోకి రావడంతో ముచ్చటగా మూడవసారి జతకడుతున్న వీరి కాంబినేషన్ లో ‘అల వైకుంఠ పురములో’ మూవీ రేంజ్ కి మించిన బ్లాక్ బష్టర్ వస్తుందని అందరు ఆశిస్తున్నారు.


వాస్తవానికి మహేష్ త్రివిక్రమ్ ల మూవీ ప్రారంభం కావడమే చాల ఆలస్యంగా జరిగింది. ఈమూవీకి సంబంధించిన కథలో రకరకాల మార్పులు రావడంతో పాటు ఈమూవీని పాన్ ఇండియా మూవీగా తీర్చిదిద్దాలని మహేష్ త్రివిక్రమ్ లు భావించడంతో ఈమూవీ కథలో అనేక మార్పులు జరిగాయి. వాస్తవానికి త్రివిక్రమ్ ఒక కథను వ్రాసుకున్న తరువాత ఇన్నిసార్లు మార్పులు చేసిన పరిస్థితి ఎప్పుడూ అతడికి ఏర్పడలేదు అన్న వార్తలు కూడ సోషల్ మీడియాలో హడావిడి చేసాయి.


ఎట్టకేలకు ప్రారంభం అయిన ఈసినిమా భవిష్యత్ షెడ్యూల్స్ కు లేటెస్ట్ గా బాలీవుడ్ లో విడుదలై ఘోరమైన ఫ్లాప్ గా మారిన ‘షెహజాదా’ ఫలితం మహేష్ త్రివిక్రమ్ ల ప్రాజెక్ట్ ను పరోక్షంగా కలవర పెడుతోందా అంటూ కొన్ని కామెంట్స్ వినిపిస్తున్నాయి. తెలుగు ప్రజలు కనకవర్షం కురిపించిన ‘అల వైకుంఠపురములో’ రీమేక్ గా వచ్చిన ‘షెహజాదా’ భయంకరమైన ఫ్లాప్ గా మారడంతో త్రివిక్రమ్ కథల మ్యాజిక్ బాలీవుడ్ ప్రేక్షకులకు నచ్చడం లేదా అన్న సందేహాలు కొందరు వ్యక్తపరుస్తున్నారు.  


ఈసినిమా మాత్రమే కాదు పవన్ త్రివిక్రమ్ ల బ్లాక్ బష్టర్ మూవీ ‘అత్తారింటికి దారేది’ అల్లు అర్జున్ త్రివిక్రమ్ ల ‘జులాయి’ మూవీల హిందీ రీమేక్ లు కూడ బాలీవుడ్ లో ఫ్లాప్ కావడంతో త్రివిక్రమ్ కథలు కేవలం తెలుగు ప్రేక్షకులకు తప్పించి ఉత్తరాది ప్రేక్షకులకు ఏమాత్రం నచ్చవా అన్న కామెంట్స్ కూడా వస్తున్నాయి. ఇప్పుడు ఈవిషయాలు మహేష్ దృష్టి వరకు రావడంతో మరొకసారి త్రివిక్రమ్ మహేష్ ల కథ విషయమై బాలీవుడ్ ప్రేక్షకుల అభిరుచిని దృష్టిలో పెట్టుకుని మార్పులు జరిగినా ఆశ్చర్యం లేదు అంటూ కొందరు ఊహాగానాలు చేస్తున్నారు..



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: