చరణ్ ఇండైరెక్టుగా ఆ షోకి ఆహ్వానం కోరుతున్నాడా?
ఇక రామ్ చరణ్ మాట్లాడుతూ.. నాటునాటు పాటకు ఆస్కార్ అవార్డు వస్తే ఒక భారతీయుడిగా చాలా గర్వపడతానని అన్నాడు. ఇక అక్కడి తెలుగు మీడియా అన్ స్టాపబుల్ షో గురించి ప్రశ్నించగా రామ్ చరణ్ చాలా ఆసక్తికర సమాధానం ఇచ్చారు.బాల కృష్ణ అన్ స్టాపబుల్ షో లో ప్రభాస్, పవన్ ఎపిసోడ్స్ చరణ్ ఫోన్ మాట్లాడిన సంగతి తెలిసిందే. ఇక అన్ స్టాపబుల్ షో కు వెళ్లాలనుకుంటున్నారా.? అని ప్రశ్నించగా.. అన్ స్టాపబుల్ షో తనకు బాగా నచ్చిందని, బాలకృష్ణ గారి హోస్టింగ్ అదిరిపోయిందని చెప్పుకొచ్చాడు రామ్ చరణ్.అన్ స్టాపబుల్ కు తనకు ఆహ్వానం వస్తే మాత్రం ఆ షోకి వెళ్ళడానికి రెడీ అన్నారు రామ్ చరణ్.అయితే ఈ షోకి వెళ్ళడానికి రామ్ చరణ్ చాలా ఆసక్తిగా ఉన్నాడని తెలుస్తుంది. అంటే బాలయ్యకి చరణ్ ఇండైరెక్టుగా పిలవమని హిట్ ఇస్తున్నాడా అనే ఊహగానాలు వ్యక్తం అవుతున్నాయి.