ప్రస్తుతం యాక్షన్ సినిమాల ట్రెండ్ నడుస్తుంది.మన సీనియర్ హీరోలు యాక్షన్ మూవీస్ తో ఇరకొట్టేస్తున్నారు. ముఖ్యంగా క్లైమాక్స్ ముఖ్యం బిగిలు అంటూ క్లైమాక్స్ సీన్స్ లో భారీగా యాక్షన్ చూపిస్తున్నారు. అలాంటి క్లైమాక్స్ ఫైట్స్ తో ఆకట్టుకున్న సినిమాలు తెలుసుకుందాం.'విక్రమ్' సినిమాతో మరోసారి తన సత్తా ఏంటో ప్రపంచానికి చూపించాడు లోక నాయకుడు కమల్ హాసన్. గతేడాది విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద ఊహించని రేంజిలో భారీ వసూళ్లు రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.450 కోట్లకు పైగా వసూళ్ల రాబట్టి.. కోలీవుడ్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ఈ సినిమా నిలిచింది. ముఖ్యంగా ఈ సినిమా క్లైమాక్స్ అయితే అదిరిపోయిందనే చెప్పాలి.కమల్ హాసన్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ఇండియన్ 2 సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో కూడా భారీ యాక్షన్ సీన్స్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారట.
ఇంకా అలాగే పఠాన్‌తో కొత్త రికార్డులను సెట్ చేస్తున్నాడు బాలీవుడ్ బాలీవుడ్ బాద్షా. ఈ సినిమా ఇప్పటికే రూ.1000 కోట్లు వసూళ్లను సాధించి ఎన్నో రికార్డులు క్రియేట్ చేసింది. తన లైఫ్ లో ఎప్పుడు చేయనటువంటి యాక్షన్‌ని ఈ సినిమాలో చేసి చూపించాడు కింగ్‌ఖాన్. ముఖ్యంగా క్లైమాక్స్ అయితే పీక్స్ అనే చెప్పాలి. ఆయన అభిమానుల కోసం కష్టమైన స్టంట్స్ చేసి మెస్మరైజ్ చేశాడు. ఇప్పుడు అట్లీ దర్శకత్వంలో నటిస్తున్నాడు షారుఖ్. జవాన్ టైటిల్‌తో రాబోతున్న ఈ సినిమా కూడా ఫుల్ అండ్ ఫుల్ యాక్షన్ జోనర్‌లోనే తెరకెక్కింది. అలాగే రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ ఆర్ ఆర్ సినిమా కూడా స్టార్టింగ్ నుంచి ఎండ్ దాకా కుమ్మేసింది. ఈ సినిమా ప్రీ ఇంటర్వెల్ ప్లస్ క్లైమాక్స్ గూస్ బంప్స్ తెప్పించాయి. అలాగే కాంతార.. ఈ సినిమా క్లైమాక్స్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇండియన్ సినీ చరిత్రలో కనీ వినీ ఎరుగని రీతిలో ఈ క్లైమాక్స్ తెరకెక్కి ఎంతగానో ఆకట్టుకుంది.