హ్యాట్రిక్ హిట్ కొట్టిన సంయుక్త.. రేంజ్ మామూలుగా లేదుగా..!
వెంకీ అట్లూరి దర్శకత్వంలో సంయుక్త మీనన్, ధనుష్ జంటగా నటించిన ఈ చిత్రం తాజాగా విడుదలయ్యి భారీ విజయాన్ని సొంతం చేసుకోవడం జరిగింది. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. నిన్న ప్రీమియర్ షో వేయగా మొదటి షో తోనే భారీ రెస్పాన్స్ అందుకున్న ఈ సినిమా ఈరోజు ఫిబ్రవరి 17న విడుదలై అంతకుమించి రెస్పాన్స్ పొందుతోంది.. సమాజంలో ఉన్న విద్యావ్యవస్థపై ఎటువంటి అన్యాయాలు జరుగుతున్నాయి .. పేద ప్రజల బలహీనతను డబ్బుగా ఎలా మార్చుకుంటున్నారు అనే విషయంపై తెరకేక్కిన ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.
ఇకపోతే ఈ మూడు సినిమాలతో వరుసగా హ్యాట్రిక్ విజయాన్ని అందుకున్న ఈ ముద్దుగుమ్మ రేంజ్ పూర్తిగా మారిపోయింది. తన పేరు నుంచీ మీనన్ అనే పేరును తొలగించి సంయుక్తగా తన పేరును పెట్టుకుంది. కనీసం ఇలానైనా ఆమెకు మరిన్ని విజయాలు వరిస్తాయేమో చూడాలి . మొత్తానికి అయితే మలయాలకుట్టి తెలుగులో బాగా పాపులారిటీ దక్కించుకుంటోందనటంలో సందేహం లేదు.