చాలా రోజుల తర్వాత జిమ్ లో పవన్ కళ్యాణ్.. ఆ సినిమా కోసమేనట?

praveen
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ పేరుకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హిట్టు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా పవన్ కళ్యాణ్ కు అభిమానులు రోజురోజుకు పెరిగిపోతూనే ఉంటారు. ఏకంగా అందరు హీరోలకు అభిమానులు ఉంటే అటు పవన్ కళ్యాణ్ కు మాత్రం ఏకంగా భక్తులు ఉన్నారు అంటూ స్వయంగాపవన్ కళ్యాణ్ అన్న మెగాస్టార్ చిరంజీవి కూడా చెప్పారు. నిజంగానే పవన్ కళ్యాణ్ కు అందరూ వీరాభిమానులే ఉంటారు అని చెప్పాలి.

 దీన్ని బట్టి ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. అయితే స్టార్ హీరోగా కొనసాగుతున్న సమయంలోనే రాజకీయాల్లోకి వెళ్లి ఇక ఇప్పుడు రాజకీయాలను సినిమాలను కూడా బ్యాలన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు అని చెప్పాలి. ఇక ఇప్పుడు వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నారు పవన్ కళ్యాణ్. అయితే ఇక ఇప్పుడు చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ జిమ్ లో వర్క్ అవుట్ లో చేసేందుకు సిద్ధమైపోతున్నాడట.  ఒక సినిమా కోసం ఏకంగా తన బాడీ షేప్ ను మార్చుకోబోతున్నాడట పవన్ కళ్యాణ్. సాయిధరమ్ తేజ్ హీరోగా వినోదాయ సీతం రీమేక్ లో కూడా నటిస్తున్నాడు పవన్ కళ్యాణ్. ఈ పవన్, సాయి ధరంతేజ్ ఇద్దరు హీరోలే. అయితే ఇక ఈ సినిమా కోసం పవన్ బరువు తగ్గేందుకు సిద్ధమయ్యాడట.

 ఇక ఈ సినిమా త్రివిక్రమ్ రచనలో సముద్రఖిని ప్రాజెక్టుకు దర్శకత్వం వహించబోతున్నాడు. అయితే ఈ సినిమా ఫిబ్రవరి 14వ తేదీ నుంచి ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ కొన్ని కారణాలవల్ల మరో వారం పాటు వాయిదా పడింది అన్నది తెలుస్తుంది. అయితే ముందుగా సాయిధరమ్ తేజ్ కి సంబంధించిన సన్నివేశాలు షూటింగ్ని చేయబోతున్నారట. ఇక ఆ తర్వాత కాస్త ఆలస్యంగానే పవన్ కళ్యాణ్ షూటింగ్లో పాల్గొనే అవకాశం ఉంది అన్నది తెలుస్తుంది. మరి ఈ మెగా హీరోల కాంబినేషన్లో రాబోతున్న సినిమా ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి మరి. ఇక ఈ సినిమాపై రోజురోజుకు అంచనాలు పెరిగిపోతున్నాయి అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: