900 కోట్ల భారీ బడ్జెట్ తో.. శంకర్ మల్టీస్టారర్.. హీరోలు ఎవరంటే?
ఇకపోతే ప్రస్తుతం దర్శకుడు శంకర్ ఒకవైపు కమల్ హాసన్ తో భారతీయుడు 2 సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమాపై కూడా భారీ రేంజ్ లోనే అంచనాలు ఉన్నాయి అని చెప్పాలి. అదే సమయంలో మరోవైపు రాంచరణ్ తో కూడా ఒక సినిమాతో బిజీబిజీగా ఉన్నాడు. ఇక ఈ సినిమా కూడా ఎలా ఉండబోతుంది అనేదానిపై ఇక ఎన్నో ఊహాగానాలు కూడా తెర మీదకి వస్తున్నాయి అని చెప్పాలి. అయితే రామ్ చరణ్ తో సినిమా ముగిసిన తర్వాత ఇక శంకర్ ఫ్యూచర్ ప్రాజెక్టులు ఏంటి అన్న ప్రశ్న కూడా ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిపోయింది.
ఈ క్రమంలోనే డైరెక్టర్ శంకర్ రామ్ చరణ్ తో సినిమా తర్వాత ఒక భారీ మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్నాడు అన్నది తెలుస్తుంది. అంతేకాకుండా డైరెక్టర్ శంకర్ కెరియర్ లోనే భారీ బడ్జెట్ మూవీ గా ఈ సినిమాను తెరకెక్కించబోతున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఏకంగా 900 కోట్ల బడ్జెట్ తో ఈ మూవీ ప్లాన్ చేస్తున్నాడట. బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్.. తమిళ స్టార్ విజయ్ తో ఇక ఈ మల్టీస్టారర్ ఉండబోతుంది అన్న టాక్ ప్రస్తుతం చక్కర్లు కొడుతుంది అని చెప్పాలి. సైన్స్ ఫిక్షన్ డ్రామాగా ఈ సినిమా ఉండబోతుందట. ఇదివరకు ఓ స్కై ఫైవ్ సినిమాను ప్లాన్ చేస్తున్నట్లు శంకర్ తెలిపాడు. బహుశా ఆ సినిమా ఇదేనేమో అని అనుకుంటున్నారు అందరూ.