తమిళ స్టార్ హీరో తలపతి విజయ్ కి తమిళనాడులో ఫాలోయింగ్ ఏ రేంజ్ లో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తెలుగులో మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ కి ఈ స్థాయిలో అయితే మాస్ ఫాలోయింగ్ ఉందో తమిళంలో విజయ్ కి కూడా అలాగే ఉంది.ఈ మధ్యకాలంలో వరుస సినిమాలతో మోస్ట్ ఫుల్ హీరోగా కోలీవుడ్ లో విజయ్ దూసుకుపోతున్నాడు. తెలుగులో మహేష్ బాబు ఎలా అయితే భరత్ అను నేను సినిమా తర్వాత వరుస హిట్లతో జర్నీ చేస్తున్నాడో... అలాగే విజయ్ కూడా గత ఐదేళ్ళ కాలంలో ఫ్లాప్ అనేదే లేకుండా సూపర్ హిట్స్ తోనే దూసుకుపోతున్నాడు. థియేటర్ లో విజయ్ సినిమా పడిందంటే చాలు ఖచ్చితంగా వందకోట్ల షేర్ చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇక విజయ్ సినిమాకి బడ్జెట్ కూడా వారం రోజుల్లోనే కలెక్ట్ చేసేస్తుంది.చాలా సినిమాలు నిర్మాతలకి మంచి టేబుల్ ప్రాఫిట్ లను కూడా తీసుకొచ్చాయి. తాజాగా వచ్చిన వారిసు సినిమా కూడా జస్ట్ యావరేజ్ టాక్ తో లాభాలు తెచ్చిపెట్టింది.
గత కొన్నేళ్ళ నుంచి విజయ్ సినిమాల కలెక్షన్స్ షేర్ చేసుకుంటే ఫస్ట్ ప్లేస్ లో మాస్టర్ మూవీ ఉంది. ఇది 141కోట్ల షేర్ ని రాబట్టింది. ఆ తరువాత బిగిల్ 139 కోట్ల షేర్ రాబట్టి రెండో స్థానంలో నిలిచింది. ఇక ఇప్పుడు మూడో స్థానంలో 137 కోట్ల షేర్ తో వారిసు సినిమా నిలవడం విశేషం. తరువాత సర్కార్ సినిమా 125 కోట్ల షేర్ ని రాబట్టింది.అలాగే మెర్సల్ మూవీ 120 కోట్ల షేర్ ని రాబట్టింది. తరువాత బీస్ట్ మూవీ 113 కోట్ల షేర్ ని రాబట్టింది. ఈ మధ్యకాలంలో వచ్చిన వాటిలో బీస్ట్ మూవీకి స్టార్టింగ్ లో నెగిటివ్ టాక్ వచ్చింది. అయితే లాంగ్ రన్ లో ఈ సినిమా మంచి షేర్ ని రాబట్టి హిట్ గా నిలిచింది.ప్రస్తుతం విజయ్ లోకేష్ కనకరాజ్ తో లియో అనే సినిమా చేస్తున్నాడు. ఇది వీరి ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన రెండో సినిమా.ఈ సినిమాపై కూడా అంచనాలు చాలా భారీగా వున్నాయి. మరి చూడాలి ఈ సినిమా ఎలాంటి ఘన విజయం సాధిస్తుందో..