ఆ అవకాశం రావడం నా అదృష్టం : నిధి అగర్వాల్

murali krishna
ఇస్మార్ట్ బ్యూటీ అయిన నిధి అగర్వాల్ స్థానం ఎక్కడ అనేది ప్రత్యేకంగా అయితే చెప్పాల్సిన పనిలేదు.స్టార్ స్టేటస్ రాకపోయిన హాట్ ట్రీట్ ఇవ్వడంతో తనకు సాటెవ్వరూ లేరని ప్రూవ్ చేసుకుంది నిధి. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సినిమాలో నటిస్తున్న ఈ అమ్మడి గ్లామర్ రెట్టింపయింది.

 
హైదరాబాద్‌కు చెందిన మార్వాడి కుటుంబంలో జన్మించిందట నిధి అగర్వాల్. తొలుత మోడలింగ్ రంగాన్ని ఎంచుకున్న ఈ బ్యూటీ.. 2017లో 'మున్నా మైఖేల్' అనే హిందీ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిందట.. ఆ తర్వాత టాలీవుడ్ లో 
నాగ చైతన్య హీరోగా తెరకెక్కిన సవ్య సాచి సినిమాతో తెలుగుప్రేక్షకులకు పరిచయమై.. పూరితో జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో యూత్ ని బుట్టలో వేసుకుంది ఈ అందాల నిధి అగర్వాల్.

 
సినిమాలతో పాటు సోషల్ మీడియాలో కూడా తన అందాలతో హంగామా చేస్తూ ఫాలోయింగ్‌ పెంచుకుంటోంది నిధి అగర్వాల్. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోషూట్స్ పోస్ట్ చేస్తూ కుర్రకారు మతి పోగొడుతోంది.ఈ క్రమంలోనే తాజాగా ఓ గులాబీ కలర్ డ్రెస్ తో ఫోటోలకు పోజులిచ్చి మాయ చేసింది నిధి అగర్వాల్. ఈ ఫోటోలను అభిమానులతో పంచుకుంటూ.. మీరు నన్ను ప్రేమించిన దాని కన్నా నన్ను నేను ఎక్కువ ప్రేమించుకుంటాను అంటూ క్యాప్షన్ రాసింది. దీంతో ఈ పిక్స్ క్షణాల్లో వైరల్ అయ్యాయి.

 నిధి అగర్వాల్ అందచందాలు చూసి ఫిదా అవుతున్నారట నెటిజన్లు. మరీ ముఖ్యంగా పవన్ ఫ్యాన్స్ అయితే తెగ పిచ్చెక్కిపోతున్నారు. పవన్ తో ఆమె హరిహర వీరమల్లు సినిమాలో నటిస్తుండటంతో.. నిధి గ్లామర్ పవర్ స్టార్ స్టామినాకు మంచి బూస్టింగ్ ఇస్తుందనే కోణంలో కామెంట్లు కూడా పెడుతున్నారు.విభిన్నమైన చారిత్రక అంశాలను ఆధారంగా చేసుకుని హరిహర వీరమల్లు సినిమా రూపొందిస్తున్నారట దర్శకుడు క్రిష్. ఈ చిత్రంలో రాబిన్ హుడ్ తరహా పాత్ర చేస్తున్నారట పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ నుంచి వస్తున్న మొదటి పాన్ ఇండియా సినిమా ఇదే కావడం గమనార్హం.

 
ఈ సినిమాపై పవన్ ఫ్యాన్స్ చాలా అంచనాలు పెట్టుకున్నారు.. ఇది పవన్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ సినిమా అవుతుందని కూడా వారు ఆశ పడుతున్నారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ వజ్రాల దొంగగా కనిపించనున్నాడని సమాచారం.కెరీర్ పరంగా పవన్ కళ్యాణ్‌తో రొమాన్స్ చేసే ఛాన్స్ రావడం ఓ మంచి అవకాశమని, ఇది సరిగా వాడుకుంటే ఇస్మార్ట్ బ్యూటీకి స్టార్ హీరోల సినిమాలో ఆఫర్స్ ఖాయమే అని అంటున్నారట సినీ పెద్దలు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: