అదో చెత్త మూవీ. వాళ్ళమీద ఉమ్మేశారు: ప్రకాష్ రాజ్

Purushottham Vinay
దేశంలో ఉన్న అతి కొద్ది గొప్ప పాన్ ఇండియా నటులలో ప్రకాష్ రాజ్ ఒకరు. ఏ పాత్రలోకైనా పరకాయ ప్రవేశం చేసి జీవించేస్తాడు ప్రకాష్ రాజ్. అయితే వరుస సినిమాలతో పాటు వివాదాలతో కూడా నిత్యం వార్తల్లో నిలుస్తుంటాడు ఈ విలక్షణ నటుడు ప్రకాశ్‌ రాజ్‌. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చాలా కాంట్రవర్సీ కామెంట్స్ చేస్తూ తెగ హైలెట్‌ అవుతున్నారు.ఏ విషయన్నైనా కూడా కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడే ప్రకాశ్‌ రాజ్‌ తాజాగా బాలీవుడ్ సినిమాలు అయిన పఠాన్‌, కశ్మీర్‌ ఫైల్స్‌ లపై సంచలన వ్యాఖ్యలు చేశాడు.ఇక కేరళలోని తిరువనంతపురంలో జరుగుతున్న మాతృభూమి ఇంటర్నేషనల్ ఫెస్టివల్ ఆఫ్ లెటర్స్(MBIFL 2023)ఈవెంట్ లో పాల్గొన్న ప్రకాశ్ రాజ్ మీడియాతో మాట్లాడటం జరిగింది. ఈ సందర్భంగా కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ నటించిన పఠాన్ మూవీ విజయాన్ని కొనియాడుతూనే.. ది కశ్మీర్‌ ఫైల్స్ పై షాకింగ్ కామెంట్స్‌ చేశాడు ప్రకాష్ రాజ్. 'పఠాన్ సినిమాను బ్యాన్ చేయాలన్న ఈ ఇడియట్స్, బిగాట్స్ ఎవరైతే ఉన్నారో.. వాళ్లకి సమాధానంగా ఇప్పుడా సినిమా రూ. 700 కోట్లకు పైగా వసూలు చేసి దూసుకుపోతోంది. పఠాన్ మూవీని బ్యాన్ చేయాలని గోల చేసినవారే.. మోడీ కు కనీసం రూ.30 కోట్లు కూడా వసూళ్ళని రాబట్టలేకపోయారు.


అలాంటి కుక్కలు కేవలం మొరుగుతారంతే, కరవరు. వీరు జస్ట్ సౌండ్ పొల్యూషన్ మాత్రమే.. ఇక రీసెంట్ గా వచ్చిన నాన్ సెన్స్ మూవీస్ లో 'కశ్మీర్ ఫైల్స్' మూవీ ఒకటి. ఆ మూవీని ఎవరు ప్రొడ్యూస్ చేశారో మనందరికీ తెలుసు. ఇది ఖచ్చితంగా చాలా సిగ్గుచేటు. ఇంటర్నేషనల్ జ్యూరీనే ఈ సినిమా మేకర్స్ పై ఉమ్మేసింది. పైగా తనకు ఎలాంటి ఆస్కార్ నామినేషన్ రాలేదని డైరెక్టర్ అడుగుతున్నాడు. నిజం చెప్తున్నా వాడికి 'భాస్కర్' అవార్డు కూడా రాదు. ఎందుకంటే బయట చాలా సెన్సిటివ్ మీడియా అనేది ఉంది. అందుకే నేను మీకు చెప్తున్నా. మీరు ఇక ఒక ప్రోపగాండాతో చేయొచ్చు. నాకు తెలిసి ఇలాంటి మూవీలు చేయడానికే వాళ్లు దాదాపు రూ. 2000 కోట్లు పెట్టుబడి పెట్టారేమోననిపిస్తుంది. కానీ, ప్రతిసారి కూడా జనాల్ని ఫూల్ చేయలేరు' అని ప్రకాశ్‌రాజ్‌ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ ఇండస్ట్రీలో సంచలనంగా మారాయి. అయితే ఆస్కార్ అవార్డుకు పేరడీగా అత్తారింటికి దారేది లో బ్రహ్మానందంని పెట్టి భాస్కర్ అవార్డుతో  ఓ కామెడీ సీన్ ను క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడా విషయాన్నే గుర్తు చేస్తూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు ప్రకాశ్ రాజ్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: