సుజిత్ మూవీ కోసం కేవలం అన్ని రోజులు మాత్రమే కేటాయించనున్న పవన్ కళ్యాణ్..!

Pulgam Srinivas
సినిమా ఇండస్ట్రీ లోకి ప్రతి సంవత్సరం ఎంతో మంది కొత్త దర్శకులు ఎంట్రీ ఇస్తూ ఉంటారు. కానీ వారిలో కొంత మంది కి మాత్రమే దర్శకత్వం వహించిన మొట్ట మొదటి మూవీ తోనే అద్భుతమైన క్రేజ్ ... అద్భుతమైన విజయం లభిస్తూ ఉంటుంది. అలాంటి వారిలో యంగ్ డైరెక్టర్ సుజిత్ ఒకరు. ఈ దర్శకుడు శర్వానంద్ హీరో గా రూపొందిన రన్ రాజా రన్ మూవీ తో దర్శకుడిగా తన కెరీర్ ను మొదలు పెట్టారు. ఈ మూవీ అద్భుతమైన విజయం సాధించడంతో ఈ దర్శకుడికి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అదిరిపోయే క్రేజీ లభించింది.

దానితో ఈ దర్శకుడికి రెబల్ స్టార్ ప్రభాస్ సినిమా ఛాన్స్ ఇచ్చాడు. దానితో సుజిత్ ... ప్రభాస్ తో సాహో అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ ని నిర్మించాడు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద విజయం సాధించలేదు. దానితో సాహో విడుదల అయిన చాలా రోజుల తర్వాత సుజిత్ తన తదుపరి మూవీ ని పవన్ కళ్యాణ్ తో ప్రకటించాడు. ఈ మూవీ ని డి వి వి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై v v DANAIAH' target='_blank' title='డి వి వి దానయ్య-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">డి వి వి దానయ్య నిర్మించబోతున్నాడు.

ఈ మూవీ ని కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రారంభించారు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం పవన్ ... సుజిత్ కాంబినేషన్ లో రూపొందబోయే మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పవన్ కళ్యాణ్ ... సుజిత్ దర్శకత్వంలో రూపొందబోయే మూవీ కి కేవలం 25 రోజుల నుండి 30 రోజులు మాత్రమే కేటాయించనున్నట్లు ... ఇందులోనే పవన్ కళ్యాణ్ కు సంబంధించిన షూటింగ్ పార్ట్ ను మొత్తం ముగించబోతున్నట్లు తెలుస్తుంది. ఈ మూవీ "ఓ జి" అనే వర్కింగ్ టైటిల్ తో జరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: