"కాంతారా" మూవీకి మొదటిసారి తెలుగులో వచ్చిన "టిఆర్పి" రేటింగ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Pulgam Srinivas
కన్నడ సినిమా ఇండస్ట్రీలో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న రిషబ్ శెట్టి గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఎన్నో కన్నడ మూవీ లలో నటించి కన్నడ సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్న ఈ నటుడు తాజాగా కాంతారా అనే మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో రిషబ్ శెట్టి హీరో గా నటించడం మాత్రమే కాకుండా ఈ మూవీ కి దర్శకత్వం కూడా వహించాడు.

ఈ సినిమాలో సప్తమి గౌడ హీరోయిన్ గా నటించగా హోంబలే ఫిలింస్‌ బ్యానర్ పై ఈ మూవీ ని విజయ్‌ కిరగందూర్‌ నిర్మించాడు. ఈ మూవీ మొదటగా కన్నడ భాషలో విడుదల అయ్యి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. దానితో ఈ మూవీ ని కొన్ని రోజుల తర్వాత తెలుగు లో కూడా విడుదల చేశారు. మంచి అంచనాల నడుమ తెలుగు లో విడుదల అయిన ఈ మూవీ తెలుగు ప్రేక్షకుల మనసు కూడా దోచుకుంది. దానితో ఈ మూవీ కి టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా అద్భుతమైన కలెక్షన్ లు లభించాయి.

అలా తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న ఈ మూవీ తాజాగా బుల్లి తెరపై ప్రసారం అయ్యి బుల్లి తెర ప్రేక్షకుల మనసు కూడా దోచుకుంది. ఈ మూవీ యొక్క సాటిలైట్ హక్కులను స్టార్ సంస్థ వారు దక్కించుకున్నారు. అందులో భాగంగా కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ ని స్టార్ సంస్థ వారు తాజాగా తెలుగు లో స్టార్ మా చానల్లో ప్రసారం చేయగా మొట్ట మొదటి సారి ఈ మూవీ బుల్లి తెరపై ప్రసారం అయినప్పుడు 12.35 "టి ఆర్ పి" రేటింగ్ వచ్చింది. ఇలా థియేటర్ లలో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న ఈ మూవీ బుల్లి తెరపై కూడా అదే రేంజ్ లో ప్రేక్షకులను అలరించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: