క్రిష్ -4 సరికొత్త కథతో రాబోతున్న హృతిక్ రోషన్..!!

Divya
బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ హీరోగా నటించిన క్రిష్ సినిమా ఎంతటి సంచలనాలను సృష్టించిందో చెప్పాల్సిన పనిలేదు. క్రిష్ ఫ్రాంచైజీ సినిమాలను ఇష్టపడని పిల్లలు పెద్దలు అంటూ ఎవరూ ఉండరు ఇప్పటికే ఎందుకు సంబంధించి మూడు సీక్వెల్స్ కూడా విడుదలయ్యాయి గత కొంతకాలంగా నాలుగో భాగం గురించి చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటివరకు అధికారికంగా ఈ సినిమా పైన ప్రకటన రాలేదు. అయితే దశాబ్దం గ్యాప్ తర్వాత క్రిష్ -4 రాబోతోందని వార్తలు వినిపిస్తున్నాయి. అది కూడా ఎప్పుడు చూడని ఫిట్స్ తో ఈ సినిమాలో హృతిక్ రోషన్ అభిమానుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది.

చాలా కాలంగా ఈ సినిమా  స్క్రిప్టు బడ్జెట్ విషయాలు చర్చలలో ఉన్నట్లుగా తెలుస్తోంది. వాస్తవానికి 2022లో ఈ సినిమా ప్రారంభిస్తామని నిర్మాత రాకేష్ రోషన్ ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు. కోవిడ్ అదుపులోకి రాగానే ఈ సినిమా ప్రారంభమవుతుందనుకున్నారు.. హృతిక్, విక్రం వేద ఫస్ట్ లుక్ పోస్టర్ సమయంలో క్రిష్ -4 సినిమా పైన హింట్ ఇవ్వడం జరిగింది. ఇక ఇప్పటికి ఈ సినిమా సమస్య తీరిందని వార్తలు వినిపిస్తున్నాయి.

రాఖీ స్టేషన్ దర్శకత్వం వహించిన చిత్రమిది కావడంతో క్రిష్ ఫ్రాంచైజీ హృతిక్ రోషన్ సూపర్ హీరోగా నటించబోతున్నారు. 2003లో కోయి మిల్ గయా, 2006లో క్రిష్.. 2013లో క్రిష్-3 విడుదలయ్యాయి ఆ తర్వాత పదేళ్లలో క్రిష్ 4 విడుదలవుతుందని అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురు చూశారు. సైఫ్ అలీ ఖాన్ తో కలిసి హృతిక్ చివరిగా విక్రం వేదా లో కనిపించారు .ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు పొందింది. దీపికా పదుకొనే అనిల్ కపూర్ లతో కలిసి పాట డైరెక్టర్ ఆనంద్ దర్శకత్వం లో ఫైటర్ లో నటించారు. ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 25న విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో హృతిక్ , దీపిక ఎయిర్ పోర్ట్ ఫైలైట్ గా కనిపించబోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: