వాయిదా పడ్డ చిరంజీవి భోళాశంకర్.. !

Divya
మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నెంబర్ 150 సినిమా ద్వారా రీ ఎంట్రీ ఇచ్చి వరుస సినిమాలు చేస్తూ కుర్ర హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నారు. ముఖ్యంగా పాన్ ఇండియా రేంజ్ లో యంగ్ హీరోలు దూసుకుపోతుంటే వారి సినిమాల కలెక్షన్లతో సమానంగా ఈయన కేవలం తెలుగు , తమిళ్ భాషలోనే చిత్రాలను విడుదల చేస్తూ తన స్టామినా నిరూపించుకుంటున్నారు. తాజాగా ఆయన నటించిన చిత్రం వాల్తేరు వీరయ్య . సంక్రాంతి పండుగ సందర్భంగా ఇదే ఏడాది జనవరి 13వ తేదీన విడుదలైన సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకోవడమే కాకుండా కలెక్షన్ల సునామీ సృష్టించి చిరంజీవి పూర్వ వైభవాన్ని కలిగించింది.
ప్రస్తుతం ఆయన తెరకెక్కిస్తున్న మరొక చిత్రం భోళాశంకర్.. సిస్టర్ సెంటిమెంట్తో వస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.  ఇందులో చిరంజీవి హీరోగా,  కీర్తి సురేష్ చెల్లెలు పాత్రలో నటిస్తోంది. మరొకపక్క మిల్క్ బ్యూటీ తమన్న హీరోయిన్గా ఎంపికైన విషయం తెలిసిందే. మెహర్ రమేష్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా మలయాళం సూపర్ హిట్ వేదాళం  రీమేక్ గా తెరకెక్కపోతున్న నేపథ్యంలో సినిమాపై అంచనాలు భారీగా నెలకొన్నాయి. ముఖ్యంగా మన నేటివిటీకి తగ్గట్టుగా ఈ సినిమాలో మాస్,  యాక్షన్ సన్నివేశాలు ఎక్కువగా ఉండే విధంగా చిరంజీవి జాగ్రత్త వహిస్తున్నారట.
ఇదిలా వుండగా తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాను ఏప్రిల్ 14వ తేదీన విడుదల చేయాలని చిత్ర బృందం ప్రకటించింది. అయితే ఈ సినిమాను ఏకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో నిర్మిస్తున్నారు.  మరొకవైపు ఇదే బ్యానర్ లో అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఏజెంట్ సినిమా కూడా విడుదల విషయంలో అటు ఇటు ఉంది.  అందుకే ఈ సినిమాకు ఏప్రిల్ 14వ తేదీని ఖరారు చేసి.. భోళా శంకర్ సినిమాను వాయిదా వేసినట్లు తెలుస్తోంది.  మే నెలలో సంక్రాంతి సెలవుల సందర్భంగా చిరంజీవి భోళా శంకర్ సినిమాను విడుదల చేయబోతున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: