ఈసారి బాక్స్ ఆఫీస్ వద్ద ప్రభాస్, బన్నీ వార్?

Purushottham Vinay
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కన్నా కూడా సోషల్ మీడియాలో ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా వల్ల నిర్మాతలు కొన్ని ఏరియాల్లో నష్టపోయిన ఈ సినిమాలో డైలాగ్స్ కి ఇంకా పాటలకి దేశావ్యాప్తంగా వచ్చిన రీచ్ వల్ల కొంచెం లాభపడ్డారు. ముఖ్యంగా ఈ సినిమా తెలుగులో కంటే  హిందీలో సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది.తెలుగులో నష్టాలు మిగిల్చినా బాలీవుడ్ లో ఏకంగా 100 కోట్లు పైగా ఈ సినిమా రాబట్టడం విశేషం. అలాగే గత ఏడాది సోషల్ మీడియాలో హైయెస్ట్ వ్యూస్ సొంతం చేసుకున్న పాటలలో మూడు సాంగ్స్ పుష్ప సినిమాకి సంబంధించినవే కావడం విశేషం.శ్రీవల్లి,ఉ అంటావా, సామి సామి సాంగ్స్.. ఈ మూడు కూడా సోషల్ మీడియాలో ఒక రేంజిలో వైరల్ అయ్యాయి. ఈ పాటలు అన్ని భాషల్లో కూడా సోషల్ మీడియాని సెన్సేషన్ చేశాయి. దీంతో పుష్పాకి సీక్వెల్ గా రాబోతున్న పుష్ప ది రూల్ సినిమాపై కూడా ఎన్నో భారీ అంచనాలు క్రియేట్ అయ్యి ఉన్నాయి.


ఈ సినిమాతో ఏకంగా 500 కోట్లకు పైగా కలెక్షన్ టార్గెట్ తో సుకుమార్ రెడీగా ఉన్నాడు. ఇదిలా ఉంటే మరో స్టార్ హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మారుతి దర్శకత్వంలో అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ తో ఓ హర్రర్ థ్రిల్లర్ సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.ఈ సినిమా షూటింగ్ కూడా ఇప్పటికే స్టార్ట్ అయింది. భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమా వర్కింగ్ టైటిల్ గా రాజా డీలక్స్ అనుకుంటున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ కి జోడిగా హాట్ బ్యూటీస్ మాళవిక మోహనన్ ఇంకా నిధి అగర్వాల్ అలాగే ఆశికా రంగనాథ్ నటిస్తున్నారు. ఈ మూవీ కథ మొత్తం కూడా కేవలం ఒక ప్యాలెస్ లో జరుగుతుందని తెలుస్తుంది.ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ రెండు సినిమాలు కూడా వచ్చే ఏడాది ఒకేసారి విడుదల అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వచ్చే ఏడాది సమ్మర్ లో ఈ సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి  నిర్మాతలు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ ఇద్దరు హీరోలు మధ్య సమ్మర్ వార్ జరిగే ఛాన్స్ ఉంది.మరి ఈ రెండు సినిమాల్లో ఏ సినిమా విన్ అవుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: