ఆంధ్రుడు సినిమా హీరోయిన్ ఇప్పుడు ఎలా వుందో తెలుసా...?

murali krishna
తన అందంతో అలాగే అభినయం తో ఆడియన్స్ హృదయాలను గెలుచుకున్న హీరోయిన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు

ఇక మొదటి సినిమాతో నే బ్లాక్ బాస్టర్ హిట్ అందుకొని ఆ తరువాత అంత గా కలిసి రాకపోవడంతో ఒకటి రెండు చిత్రాలు చేసి ఇండస్ట్రీ కి దూరమైన వారిలో హీరోయిన్ గౌరీ పండిట్ కూడ ఒకరని చెప్పవచ్చు.

ఈమె గోపీచంద్ హీరోగా నటించిన ఆంధ్రుడు సినిమా తో టాలీవుడ్ ఇండస్ట్రీకి వచ్చింది.ఈ సినిమాకి పరుచూరి మురళి దర్శకత్వం ను వహించాడు. ఈ సినిమా 2005లో విడుదల అయింది. అప్పట్లో ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది.ఇక గౌరీ పండిట్ తన మొదటి సినిమాతోనే ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకుందనే చెప్ప వచ్చు. ఆ సినిమాలో అల్లరి ,దుఃఖం నటన,ప్రేమ అలా అన్నీ కలబోసి తీసిన ఆ సినిమాతో గౌరీ ప్రేక్షకులను బాగా మెప్పించింది.

అయితే ఆంధ్రుడు సినిమా తర్వాత గౌరీ పండిట్ పలు చిత్రాల్లో కూడా నటించింది.. కానీ అవేవీ కూడా ఈమెకు పెద్దగా విజయాన్ని తెచ్చి పెట్టలేదు. ఇక ఈమె తెలుగులోనే కాకుండా హిందీ లో కూడా కొన్ని సినిమాల్లో నటించింది. గౌరీ ఆ తరువాత 2011లో బాలీవుడ్ నటుడు నిఖిల్ ద్వివేదిని పెళ్లి చేసుకున్నారు. అంతే కాకుండా వీరికి ఒక బాబు కూడా ఉన్నాడట . బాలీవుడ్ లో హౌస్ ఫుల్ చిత్రంలో కూడా నటించింది. ఆ తరువాత ఇండస్ట్రీకి ఆమె దూరం అయిపోయింది గౌరీ పండిట్ అయితే సోషల్ మీడియాలో మాత్రం బాగా యాక్టివ్ గానే కనిపిస్తూ ఉంటారు. అంతే కాకుండా తన కుటుంబానికి సంబంధించి న విషయాలను కూడా ఎప్పుడూ అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటుంది.గౌరీ పండిట్ ఆంధ్రుడు సినిమా తో గౌరీ కే కాదు గోపీచంద్ కూడా మాస్ హీరో గా మంచి పేరు తెచ్చి పెట్టింది

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: