టాలీవుడ్ ను షేక్ చేస్తున్న ఆర్థిక మాంధ్యం !

Seetha Sailaja
జూన్ నెల ప్రాంతంలో రాబోతున్న ఆర్తికమాధ్యంతో ప్రపంచంలోని అన్ని రంగాలు అతలాకుతలం అవుతాయని ఆర్ధికశాస్త్ర నిపుణులు హెచ్చరికలు చేస్తున్నారు. ఇన్ని హెచ్చరికలు వస్తూ ఉండటంతో వివిధ బడా పారిశ్రామిక సంస్థలు తమ సంస్థలలో పనిచేసే అనేకమంది ఉద్యోగులను తీసివేస్తున్నారు. ఇంత జరుగుతున్నా టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీ మాత్రం ఈవిశాయాలకు మినహాయింపుగా కనిపిస్తోంది అంటూ విశ్లేషణలు వస్తున్నాయి.


నిర్మాతల లాభార్జనతో సంబంధం లేకుండా మీడియం రేంజ్ హీరోల నుండి టాప్ హీరోల వరకు తాము నటించే ప్రతి సినిమాసినిమాకు హీరోలు పెంచుతున్న పారితోషికాలతో నిర్మాతల పరిస్థితి అయోమయంగా మారిపోయి వారికి వచ్చే లాభాలు అన్నీ వడ్డీలకు సరిపోతున్నాయి అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ‘ధమాక’ విడుదల అయ్యేంతవరకు కేవలం 10 నుంచి 12 కోట్లు మాత్రమే తీసుకున్న రవితేజా ‘వాల్తేర్ వీరయ్య’ సూపర్ సక్సస్ తరువాత అతడి పారితోషికాన్ని 20 కోట్ల స్థాయికి తీసుకువెళ్ళినట్లు వార్తలు వస్తున్నాయి.

అదేవిధంగా ‘కార్తికేయ 2’ విడుదల అయ్యేంతవరకు కేవలం కోటి రూపాయల రేంజ్ లో పారితోషికం తీసుకున్న నిఖిల్ ‘కార్తికేయ 2’ సూపర్ సక్సస్ తరువాత అతడి పారితోషికాన్ని 8 నుంచి 10 కోట్ల స్థాయిలో డిమాండ్ చేస్తున్నట్లు గాసిప్పులు వస్తున్నాయి. ఇక త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ నటిస్తున్న లేటెస్ట్ మూవీకి అతడికి 30 కోట్ల పారితోషికం ఆఫర్ చేస్తున్నట్లు టాక్. అదేవిధంగా ఆమూవీకి దర్శకత్వం వహిస్తున్న త్రివిక్రమ్ కూడ 15 కోట్ల పారితోషిక రేంజ్ లో ఉన్నాడని లీకులు వస్తున్నాయి.

క్రేజీ హీరో హీరోయిన్ దర్శకుడు కి సంబంధించిన ఈ ముగ్గురి పారితోషికాలు లెక్కలలోకి తీసుకుంటే 30 కోట్ల నుండి 40 కోట్ల రేంజ్ లో నిర్మాతలు ఖర్చు పెట్టవలసి రావడంతో సినిమాకు హిట్ టాక్ వచ్చినప్పటికీ నిర్మాతలకు ఆర్ధిక బాధలు తప్పడంలేదు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఆర్థిక మాంథ్యం ఒకపక్క మరొకవైపు వడ్డీల భారంతో పాటు ఏసినిమా హిట్ అవుతుందో మరే సినిమా ఫెయిల్ అవుతుందో తెలియని అయోమయ పరిస్థితులలో టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీ ఉంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి..  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: