వావ్: పట్టు చీరలో మెరిసిపోతున్న పూజా హెగ్డే..!!

Divya
తెలుగు సినీ ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్గా క్రేజ్ సంపాదించుకున్న పూజా హెగ్డే ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ఈమె సోదరుడు పెళ్లి వేడుకలు గడిచిన కొద్ది రోజుల క్రితం చాలా ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పూజ హెగ్డే తన కుటుంబ సభ్యులతో కలిసి సందడి చేయడం జరిగింది. ఈ సందర్భంగా పూజ హెగ్డే ఖరీదైన పట్టు చీరలో చాలా అందంగా మెరిసిపోతోంది. తన సోదరుడు రిషబ్ హెగ్డే పెళ్లి వేడుకలలో ఈమె చాలా సాంప్రదాయమైన దుస్తులలో కనిపిస్తోంది.

ఇప్పటికే ఇమే సోదరుడి వెడ్డింగ్ ఫోటోలను సైతం షేర్ చేసిన పూజ హెగ్డే తాజాగా వెడ్డింగ్ లుక్ లో సంబంధించి కొన్ని ఫోటోలు అభిమానులతో పంచుకుంది. ముఖ్యంగా చీర కట్టులో హోయలు పోతూ ఆకట్టుకొనే ఫోజులు  ఇస్తూ హోయలు పలుకుతోంది ఈ ముద్దుగుమ్మ. ఎర్రటి పట్టు చీరలు ఆకర్షణ ఏమైనా బంగారు ఆభరణాలను ధరించిన పూజా హెగ్డే పెళ్లికూతురుల ముస్తాబయింది అంటూ ఈమె అభిమానులు ఈ ఫోటోలు చూసి కామెంట్ చేస్తున్నారు. ముఖ్యంగా తన నడుముకి వడ్డానం మెడలో హారం ఆమెను హైలైట్ గా చేస్తూ తన అందాన్ని చూపిస్తున్నాయి.
సాంప్రదాయమైన దుస్తులలో పూజా హెగ్డే చూడగానే ఈమె అందాలతో మంత్రముగ్ధుల్ని చేస్తోంది. మత్తు కళ్ళ చూపులతో చూసి చూపుల సైతం ఫిదా అవుతున్నారు. ఇక పూజ హెగ్డే షేర్ చేసిన ఈ ఫోటోలు క్షణాలలో వైరల్ గా మారుతున్నాయి.
ప్రస్తుతం పూజ హెగ్డే కెరియర్ విషయానికి వస్తే ఈమె గత ఏడాది నటించిన చిత్రాలు అన్నీ కూడా డిజాస్టర్ గా మిగిలాయి. మరి ఈ ఏడాది అయిన ఈమెకు మరిన్ని విజయాలు అందుకుంటాయేమో చూడాలి. ప్రస్తుతం మహేష్ బాబుతో కలిసి SSMB -28 చిత్రంలో హీరోయిన్గా నటిస్తున్నది అలాగే సల్మాన్ ఖాన్ తో కూడా ఒక సినిమాలో నటిస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: