తారకరత్న: ఆరోగ్య పరిస్థితిపై లేటెస్ట్ అప్డేట్?

Purushottham Vinay
ఈ వార్త నందమూరి అభిమానులకు కొంచెం ఊరటనిచ్చే వార్త ఇది. మాసీవ్ హార్ట్ స్ట్రోక్‌తో బెంగళూరు హృదయాల హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న టాలీవుడ్ ప్రముఖ నటుడు నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థతి మెరుగుపడిందని ఆయన బాబాయ్ ఇంకా నిర్మాత అయిన నందమూరి రామకృష్ణ తెలిపారు. ఇక తనకు తానుగా శ్వాస తీసుకుంటున్నారని.. ఆర్గాన్స్ అన్నీ కూడా బాగున్నట్లు ఆయన వివరించారు. అవయవాలు అన్నీ కూడా బాగా పనిచేస్తున్నాయని తెలిపారు. తారకరత్న ప్రస్తుతం వెంటిలేటర్‌పై ఉన్నారని.. మధ్యాహ్నం 1:30 గంటలకు సీటీ స్కాన్ ని తీశారని.. ఇక ఆ రిపోర్ట్ వచ్చాక మెదడు పనితీరు కూడా తెలుస్తుందని ఆయన వెల్లడించారు. అటు హార్ట్ స్పెషలిస్టులతో పాటు ఇంకా అలాగే న్యూరాలజిస్టులు కూడా తారకరత్న పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. తారకరత్నకు ఎక్మో ద్వారా చికిత్స అందిస్తున్నట్లు వచ్చిన వార్తలు పూర్తిగా అవాస్తవమన్నారు రామకృష్ణ.


ఇక రామకృష్ణ గారి మాటలను బట్టి చూస్తే.. బ్రెయిన్ స్టేటస్ తెలిశాక తరువాత ఇచ్చే చికిత్సపై ఫుల్ క్లారిటీ వస్తుంది. ప్రస్తుతం కోలుకున్నట్లు చెప్పలేం కానీ ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు సమాచారం తెలుస్తుంది. తరువాత ట్రీట్మెంట్‌కు ఆయన ఎలా రెస్పాండ్ అవుతారన్నది ఇక్కడ ప్రధానాంశంగా మారింది.తారకరత్న ఆరోగ్య పరిస్థితిని దగ్గరుండి చూసుకుంటున్నారు ఆయన బాబాయ్ నటసింహం బాలకృష్ణ. ఎప్పటికప్పుడు వైద్యులతో కోఆర్డినేట్‌ అవుతూ తారకరత్న హెల్త్‌ కండీషన్‌ను పర్యవేక్షిస్తున్నారు. అలాగే బాలకృష్ణతోపాటు కుటుంబసభ్యులంతా కూడా హాస్పిటల్‌లోనే ఉంటూ తారకరత్న ఆరోగ్యం ఇంప్రూవ్‌మెంట్‌ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు.ఇంకా అలాగే మరోవైపు తారకరత్న త్వరగా కోలుకోవాలని అటు నందమూరి అభిమానులతో పాటు ఇటు టీడీపీ కార్యకర్తలు కూడా ఎంతగానో కోరుకుంటున్నారు.తారకరత్న ఆరోగ్యం కుదుటపడి ఆయన తిరిగి ఆరోగ్యంగా మెరుగుపడాలని జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, మంచు మనోజ్ లు కూడా మాట్లాడిన సంగతి తెలిసిందే.. ప్రస్తుతం అయితే ఆయన కండిషన్ కొంచెం మెరుగ్గానే ఉంది. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: