తారకరత్న ఆరోగ్య పరిస్థితి విషమం.. గుండెపోటుతో పాటు మరో కొత్త సమస్య..!
లోకేష్ పాదయాత్రలో స్పృహ తప్పి పడిపోయిన తారకరత్నను పార్టీ కార్యకర్తలు హుటాహుటిన ఆయనను కుప్పంలోని కేసి ఆసుపత్రికి తరలించగా అక్కడ ప్రాథమిక చికిత్స తర్వాత పిఎస్ఈ ఆసుపత్రికి తీసుకెళ్లి మెరుగైన చికిత్స అందించే ప్రయత్నం చేశారు. అయితే ఇక్కడ తీవ్రమైన గుండెపోటు వచ్చినట్లు వైద్యుల నిర్ధారించారు. అంతేకాదు ఆయన గుండెలోని ఎడమవైపు కవాటం 90% వరకు బ్లాక్ అయినట్లుగా కూడా అసలు విషయాన్ని బయటపెట్టారు వైద్యులు అయితే బీపీ మాత్రం బాగానే ఉంది అని మొత్తానికి నందమూరి తారకరత్నకు ప్రాణాపాయం తప్పింది అంటూ శుక్రవారం వైద్యులు తెలిపినట్లు బాలకృష్ణ కూడా వెల్లడించారు.
నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రి చీఫ్ ను వైద్యులు సంప్రదించగా అక్కడి నుంచి అత్యాధునిక సదుపాయాలున్న ప్రత్యేక ఆంబులెన్స్ ను కుప్పంకి రప్పించినట్లు తెలుస్తోంది. అలాగే అందులో పలువురు కార్డియాలజిస్టులు కూడా రావాలని వీరు కోరగా అందుకు తగ్గట్టుగానే వాళ్ళు వచ్చి తారకరత్నకు చికిత్స చేశారు అని సమాచారం. ప్రస్తుతం భార్య అలేఖ్య రెడ్డి కూడా కుప్పం పి ఎస్ ఈ హాస్పిటల్ కి చేరుకున్నారు. బెంగళూరు నుంచి వచ్చిన డాక్టర్లు పరీక్షించిన తర్వాత ఆమెతో మాట్లాడగా.. ఆమె రిక్వెస్ట్ మేరకు తారకరత్నను బెంగళూరులోని నారాయణ హృదయాలయ హాస్పిటల్ కి అర్ధరాత్రి తరలించారు. ప్రస్తుతం మెరుగైన చికిత్స తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే ఆయనకు షుగర్ సమస్య కూడా ఉండడం వల్లే ఇప్పుడు చికిత్స ఆలస్యం అవుతున్నట్లు తెలుస్తోంది