వాల్తేరు వీరయ్య సక్సెస్ మీట్.. ముఖ్య అతిథి ఎవరంటే..?

Divya
మెగాస్టార్ చిరంజీవి తాజాగా నటించిన చిత్రం వాల్తేరు వీరయ్య. బ్రదర్ సెంటిమెంట్ తో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకుల చేత కంటతడి పెట్టించింది. ఒకవైపు ఈ సినిమాలో చిరంజీవి ఫుల్ లెన్త్ మాస్ క్యారెక్టర్ చేస్తుండగానే.. మరొకవైపు తన కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. మొదటి భాగం అంతా ప్రేక్షకులను తనదైన శైలిలో నవ్వించిన చిరంజీవి.. రెండవ భాగం రవితేజ ఎంట్రీ ఇవ్వడంతో కథ మొత్తం మారిపోయింది. అలా మొత్తానికి ఈ సినిమా ప్రేక్షకులకు బాగా నచ్చడంతో సంక్రాంతి విజేతగా నిలబెట్టారు.
ఈ సినిమాకు పోటీగా బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి సినిమా వచ్చినప్పటికీ కూడా పోటీని తట్టుకొని మరింత కలెక్షన్స్ సాధించింది.  ఈ క్రమంలోనే ఈ సినిమాకు సంబంధించిన సక్సెస్ మీట్ ను తాజాగా హనుమకొండలోని ఒక ఇంజనీరింగ్ కాలేజీలో జరుపబోతున్నారు. ఈరోజు సాయంత్రం ఘనంగా వాల్తేరు వీరయ్య సక్సెస్ మీట్ జరగబోతోంది. అయితే ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మెగాస్టార్ చిరంజీవి వారసుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హాజరు కాబోతున్నారు. మొత్తానికి ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.. కాబట్టి ఇప్పుడు సక్సెస్ మీట్ ను  కూడా నిర్వహించబోతున్నారు.

ఇక రామ్ చరణ్ విషయానికి వస్తే.. ఇటీవల ఆర్ఆర్ఆర్ చిత్రం విజయోత్సవంతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా ఈడ ఎన్టీఆర్ తో కలిసి స్టెప్పులేసిన నాటు నాటు పాటకు ఏకంగా గోల్డెన్ గ్లోబ్ అవార్డు రావడమే కాదు ఆస్కార్ నామినేషన్ లో కూడా మొదటి స్థానం సంపాదించుకోవడం గమనార్హం. మొత్తానికి అయితే ఈ ఒక్క పాటతో వీరిద్దరూ ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించుకోవడమే కాదు అంతకుమించి ఫాలోయింగ్ ను కూడా సొంతం చేసుకున్నారని చెప్పవచ్చు. ఈ సినిమా రామ్ చరణ్ కు మంచి ఇమేజ్ తెచ్చి పెట్టేది మరొకవైపు కోలీవుడ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తన 15వ చిత్రం కూడా భారీ బడ్జెట్ తో  ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: