మహేష్ బాబు #SSMB 28 మూవీ నుంచి బిగ్ అప్డేట్..!

Divya
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మహేష్ బాబు అభిమానుల ఎదురుచూపులకు తెరపడింది అని చెప్పవచ్చు. సాధారణంగా ఏ హీరో అయినా సరే సినిమాలను తెరకెక్కిస్తున్నారు అంటే ఎప్పుడు రిలీజ్ అవుతుందని అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారు. కానీ మహేష్ బాబు అభిమానులు మాత్రం షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందా అని ఎదురుచూస్తున్నారు. అయితే ఇందుకు గల కారణం సినిమా ఆలస్యం అవుతూ రావడమే.. నిజానికి గత ఏడాది జూన్లోనే మొదలు కావాల్సిన సినిమా షూటింగు ఇప్పటికి కూడా ప్రారంభించకపోవడంపై అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు.
గత ఏడాది పరుశురాం దర్శకత్వంలో మహేష్ బాబు సర్కారి వారి పాట సినిమాను తెరకెక్కించిన తర్వాత మళ్లీ త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎస్ ఎస్ ఎం బి 28 అనే వర్కింగ్ టైటిల్ తో ఒక సినిమా చేస్తున్నట్లు ప్రకటించారు కానీ ఇప్పటివరకు ఆ సినిమా షూటింగ్ కి సంబంధించి ఎటువంటి అప్డేట్ రాలేదు. అదిగో పులి ఇదిగో మేక అన్నట్టుగా సాగుతోంది సినిమా షూటింగ్. దీంతో ఎప్పుడు షూటింగ్ మొదలు పెడతారు అని అభిమానులు కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూశారు.  కానీ ఎట్టకేలకు చిత్ర యూనిట్ అభిమానులకు శుభవార్త తెలిపింది.
అసలు విషయంలోకి వెళ్తే ఎస్ ఎస్ ఎం బి 28 షూటింగ్  ఫిబ్రవరి నెలలో 23 రోజులపాటు తమిళనాడు రాష్ట్రంలోని పూంపరై లో నాన్ స్టాప్ గా సాగనుంది అని చిత్ర బృందం ప్రకటించింది. ఈ విషయం తెలిసి అభిమానులు తెగ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.  కంటిన్యూస్గా షూటింగ్ పూర్తి చేసి త్వరలోనే సినిమాను విడుదలకు సిద్ధం చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్గా,  శ్రీ లీ లా సెకండ్ హీరోయిన్ గా ఎంపికైన విషయం తెలిసిందే . ఇకపోతే జూన్ కల్లా సినిమాను విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: