మంచు కొండలలో ఎంజాయ్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్..!!

Divya
టాలీవుడ్ హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్.. మొదటిసారిగా కంచె సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో ఈమె అందం అభినయంతో మంచి సక్సెస్ను అందుకుంది. ఇక తర్వాత నటించిన చిత్రాలు పెద్దగా ఏవి ఈమెకు సక్సెస్ను తీసుకురాలేదు. దీంతో పలు సినిమాలో స్పెషల్ సాంగ్లలో కూడా నటిస్తూ సెకండ్ హీరోయిన్ గా కూడా నటించింది. అయితే బాలయ్యతో నటించిన అఖండ సినిమాతో మంచి విజయాన్ని అందుకోవడంతో ఈమెకు సినిమా అవకాశాలు వస్తాయని అభిమానులు భావించారు. కానీ ఇప్పటివరకు ఈమె తన తదుపరి చిత్రం గురించి ఎక్కడ ప్రస్తావించలేదు.

కెరియర్ సంగతి ఎలా ఉన్నప్పటికీ ఈ ముద్దుగుమ్మ లైఫ్ని మాత్రం బాగా ఎంజాయ్ చేస్తుందని చెప్పవచ్చు. ప్రగ్యా జైస్వాల్ కెరియర్లో సరైన కథలు ఎంపిక చేసుకోలేకపోవడం వల్లే ఈమె ఫ్లాపులను చవిచుసింది. అఖండ సినిమా హిట్తో ఏమి క్రెడిట్ మొత్తం సంపాదించిన సరైన బ్రేక్ మాత్రం రాలేదని చెప్పవచ్చు. ప్రస్తుతం ఈమె కెరియర్ చివరి దశకు చేరుకున్నట్లుగా తెలుస్తోంది కేవలం ఒక్క కొత్త ప్రాజెక్టు కూడా ఇమే గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. చివరిగా మోహన్ బాబు నటించిన సన్నాఫ్ ఇండియా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా ఈ సినిమా భారీ డిజాస్టర్ ను చవిచూసింది.
ఈ సినిమా ఓటీటీ లో కూడా డిజాస్టర్ కావడంతో ఈమె కెరియర్ మళ్ళీ డౌన్ అయింది. తాజాగా ఇప్పుడు మంచు కొండల్లో విహరిస్తూ ఉన్నటువంటి కొన్ని ఫోటోలను షేర్ చేయగ అవి సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. మంచు కొండల్లో చందమామ లాగా మెరిసిపోతున్న ప్రగ్యా జైస్వాల్ ఫోటోలు చూసి కుర్రకారులు సైతం వావ్ ఇంతటి అందాన్ని మంచు కొండలపై చూస్తుంటే ఊపిరాగడం లేదు అంటూ పలువురు నెటిజన్లు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా మంచు తిన్నెలపై ప్రగ్యా జైస్వాల్ ఆడుకుంటున్నటువంటి కొన్ని ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: