టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్
మూవీ కోసం ఆయన అభిమానులు ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చాలా సంవత్సరాల తరువాత మాటల మాంత్రికుడు
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ తన 28 వ
సినిమా చేస్తున్నారు.గతంలో వీరి ఇద్దరి కాంబినేషన్ లో అతడు ఇంకా
ఖలేజా లు వచ్చిన విషయం తెలిసిందే. ఈ రెండు సినిమాలు ఎంత క్రేజ్ సొంతం చేసుకున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక ఇప్పుడు మహేష్ కెరీర్ లో 28వ మూవీగా వస్తున్న ఈ
సినిమా షూటింగ్ రేపటి నుంచి చాలా గ్రాండ్ గా ప్రారంభం కానుంది. నిజానికి ఈ
మూవీ షూటింగ్ ఎప్పుడో మొదలవ్వాల్సింది. కానీ మహేష్ అన్న, అమ్మ,
నాన్న ఇలా వరుసగా చనిపోవడంతో మహేష్ ఇంట చాలా తీవ్రమైన విషాదం నిండింది. దాంతో
సినిమా షూటింగ్ కు బిగ్ బ్రేక్ పడింది. ఇక ఇప్పుడు మహేష్ ఆ బాధనుంచి కోలుకొని షూటింగ్ కు అటెండ్ కానున్నారు. ఈ మూవీని యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది. అలాగే ఈ సినిమాలో హాట్
హీరోయిన్స్ పూజాహెగ్డే, శ్రీలీల
హీరోయిన్స్ గా నటిస్తున్నారు.
ఇంకా అలాగే ఈ మూవీని ఆగస్టు నెలలో 11 వ తేదీన విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ
మూవీ కోసం
త్రివిక్రమ్ ఓ సీనియర్
హీరోయిన్ ను కూడా రంగంలోకి దింపుతున్నారని సమాచారం తెలుస్తోంది. తన ప్రతి మూవీలో ఓ సీనియర్
హీరోయిన్ ఉండేలా చూస్తుంటారు
త్రివిక్రమ్ శ్రీనివాస్.అత్తారింటికి దారేది మూవీలో నదియా ఇంకా అలాగే అజ్ఞాతవాసిలో ఖుష్బూ, ఆలా వైకుంఠపురంలో లో టబు లాంటి సీనియర్ స్టార్ బ్యూటీలను ఎంపిక చేశారు త్రివిక్రమ్. ఇప్పుడు మహేష్ కోసం కూడా ఓ సీనియర్ స్టార్
హీరోయిన్ ను రంగంలోకి దింపనున్నారట.ఇక ఆమె ఎవరో కాదు
హీరోయిన్ శోభన. ఇక అలనాటి తారల్లో
శోభన కూడా ఒకరు.ఆమె కేవలం
హీరోయిన్ గానే కాకుండా క్లాసికల్ డాన్సర్ గా కూడా ప్రసిద్ధురాలు. ప్రస్తుతం ఆమె సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఇప్పుడు మహేష్ కోసం
త్రివిక్రమ్ శోభనను తీసుకురానున్నారని టాక్ వినిపిస్తోంది. మరి ఈ వార్తల్లో నిజామెంతో ఇంకా తెలియాల్సి ఉంది.