తెలుగు
సినిమా ఇండస్ట్రీలో హిట్ , ఫ్లాప్ లతో ఏ మాత్రం సంబంధం లేకుండా వరుస
మూవీ లతో ప్రేక్షకులను అల్లరిస్తున్న
యువ హీరోలలో ఒకరు అయినటువంటి
కిరణ్ అబ్బవరం గురించి ప్రత్యేకంగా
టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ
హీరో ఇప్పటికే అనేక
మూవీ లలో నటించి తెలుగు
సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపును దక్కించుకున్నాడు. ఇది ఇలా ఉంటే పోయిన సంవత్సరం
కిరణ్ చాలా
మూవీ లతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
అందులో సమ్మతమే
సినిమా కాస్త పర్వాలేదు అనే రేంజ్ విజయాన్ని బాక్సాఫీస్ దగ్గర సొంతం చేసుకోగా , మిగతా
మూవీ లు ప్రేక్షకులను ఏ మాత్రం అలరించలేకపోయాయి. ఇది ఇలా ఉంటే తాజాగా
కిరణ్ "వినరో భాగ్యము విష్ణు కథ" అనే
మూవీ లో హీరోగా నటించాడు.
మురళి కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ
మూవీ కి
చేతన్ భరద్వాజ్ సంగీతం అందించాడు. ఈ
మూవీ ని
ఫిబ్రవరి 17 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా
థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ
మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ
సినిమా నుండి చిత్ర బృందం కొన్ని ప్రచార చిత్రాలను మరియు ఒక పాటను విడుదల చేసింది.
ఇది ఇలా ఉంటే తాజాగా ఈ
మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన మరో కేజీ అప్డేట్ ను ప్రకటించింది. ఈ
మూవీ నుండి సెకండ్ సింగిల్ విడుదలకు సంబంధించిన అప్డేట్ ను ఈ రోజు సాయంత్రం 5 గంటల 4 నిమిషాలకు ప్రకటించనున్నట్లు ఈ
మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటిస్తూ ఒక
పోస్టర్ ను కూడా విడుదల చేసింది. మరి ఈ రెండవ సింగిల్ కు సంబంధించి ఈ
మూవీ యూనిట్ ఎలాంటి అప్డేట్ ను ఇస్తుందో తెలియాలి అంటే మరి కొంత సమయం వేచి చూడాల్సిందే.