ఒకేసారి రెండు ఓటీటిలలో 18పేజస్ మూవీ.. ఎప్పుడంటే..?

Divya
యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ కార్తికేయ-2 చిత్రంతో పాన్ ఇండియా హీరోగా పేరు పొందారు. ఇక ఆ తర్వాత తను నటించే చిత్రాలు అన్నీ కూడా అదే స్థాయిలో తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారు. ఇక అనుపమ హీరోయిన్గా, నిఖిల్ హీరోగా వచ్చిన చిత్రం 18 పేజెస్ సినిమాగత ఏడాది డిసెంబర్ 23న విడుదల అయ్యింది. ఈ సినిమా కూడా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. మొదటి రోజే బ్రేక్ ఈవెంట్ టార్గెట్ ను పూర్తి చేసి బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచింది.అయితే ఈ సినిమాను GA -2 పిక్చర్స్ బ్యానర్ పై సుకుమార్ రైటింగ్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి.

ఇక ఈ సినిమా బడ్జెట్ దాదాపుగా రూ .18  కోట్ల రూపాయల వరకు చేరినట్లు తెలుస్తోంది. ఈ తరుణంలోనే ఈ సినిమా రూ .20 కోట్లకు పైగా వసూలు రాబడినట్లు సమాచారం. ఇక ఇప్పటిదాకా ఈ సినిమా థియేటర్లలో సందడి చేసిన సంగతి తెలిసిందే ..అయితే ఈ సినిమా ఇప్పుడు ఓటీటి లో స్ట్రిమింగ్ అయ్యేందుకు సిద్ధమవుతోంది అన్నట్లుగా తెలుస్తోంది. అది కూడా ఓకే రోజు రెండు ఓటీటి లలో విడుదలయ్యి అవకాశం ఉన్నది.
అయితే ఈ సినిమా మూవీ ఓటిటి రైట్స్ ను అహ సంస్థ దక్కించుకుంది. ఇక ఇప్పుడు తాజాగా మరొక ఓటీటి దిగ్గజ సంస్థ.. నెట్ ఫ్లెక్స్ ఈ సినిమాను సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ రెండు ఓటీటి లలో ఈనెల 27వ తేదీ నుంచి స్ట్రిమింగ్ కాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపైన అధికారికంగా ప్రకటన కూడా వెదబడింది ఈ సినిమాని అల్లు అరవింద్ సమర్పించగా బన్నీ వాసు నిర్మించారు. అలాగే డైరెక్టర్ సుకుమార్ ఈ సినిమాకు కథను అందించారు. ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరు కూడా పాన్ ఇండియా లెవెల్లోనే సినిమాలు తెరకెక్కించాలని చూస్తున్నారు. ప్రస్తుతం నిఖిల్ చేతిలో స్పై అనే ఒక సినిమా మాత్రమే ఉన్నది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: