న్యూ రికార్డ్.. 100 కోట్ల క్లబ్ లో తునివు..?

Purushottham Vinay
తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్‌ కు తమిళనాడులో ఒక రేంజిలో క్రేజ్ ఉంది. హిట్లు ప్లాపులు తేడా లేకుండా అక్కడ వసూళ్లను కుమ్మేస్తుంటాయి. అంతేగాక అజిత్ నటించే సినిమాలన్నీ దాదాపు తెలుగులో కూడా డబ్ అవుతూ ఉంటాయి.ఈ సంక్రాంతి పండుగకి 'తెగింపు' (తమిళంలో తునివు) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు అజిత్. జనవరి 11 వ తేదీన ఈ మూవీ తమిళ్ ఇంకా తెలుగు భాషల్లో ఏకకాలంలో విడుదల అయ్యింది. బోనీ కపూర్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకి హెచ్ వినోద్ దర్శకత్వం వహించాడు.జిబ్రాన్ మ్యూజిక్ డైరెక్టర్ కాగా…నీరవ్ షా కెమెరామెన్‌గా వర్క్ చేశారు.రాధాకృష్ణ ఎంటర్టైన్మెంట్స్ ఇంకా ఐవీవై ప్రొడక్షన్ కంపెనీలు కలిసి 'తెగింపు' సినిమాని తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేశారు. మంజు వారియర్, జాన్ కొక్కెన్, సముద్రఖని వంటి వారు ఈ సినిమాలో  కీలక పాత్రలు పోషించారు.


మొదటి రోజు ఈ సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చినా కూడా  మంచి ఓపెనింగ్స్ నే రాబట్టింది.ఇక మూడు రోజులు కలిపి అదిరిపోయే వసూళ్లు సాధించి తమిళ్ లో సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా కలిపి ఏకంగా 100 కోట్లు వసూళ్లు చేసినట్టు సమాచారం తెలుస్తుంది.ఇక 'తెగింపు' చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో రూ.2.95 కోట్ల బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.3. కోట్లకు పైగా షేర్ ను రాబట్టాల్సి ఉంది. అయితే ఫస్ట్ డే మంచి కలెక్షన్లు రాబట్టిన ఈ సినిమా రెండో రోజు నుండి బాగా డల్ అయిపోయింది. ఇక 3 రోజులు పూర్తయ్యేసరికి ఈ సినిమా  రూ.1.97 కోట్ల షేర్ ను రాబట్టింది.బ్రేక్ ఈవెన్ కు ఇంకా రూ.1.23 కోట్ల షేర్ ను ఈ సినిమా రాబట్టాల్సి ఉంది. అయితే టార్గెట్ చిన్నదే కానీ ఈ మూవీకి థియేటర్లు లేకపోవడంతో బ్రేక్ ఈవెన్ అనేది తెలుగులో చాలా కష్టంగా మారింది.మరి చూడాలి తెలుగులో ఈ సినిమా ఎలా ఆడుతుందో..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: