మెగాస్టార్ చిరంజీవి పోయిన సంవత్సరం రెండు మూవీలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అందులో ఆచార్య మూవీ తో ప్రేక్షకులను నిరాశపరిచిన చిరంజీవి "గాడ్ ఫాదర్" మూవీ తో ప్రేక్షకులను అలరించాడు. ఇది ఇలా ఉంటే తాజాగా చిరంజీవి "వాల్తేరు వీరయ్య" మూవీ లో హీరో గా నటించాడు. శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ కి బాబీ దర్శకత్వం వహించగా ... మైత్రి సంస్థ ఈ మూవీ ని నిర్మించింది. రవితేజ ఈ సినిమాలో కీలక పాత్రలో నటించగా ... రవితేజ భార్య పాత్రలో కేథరిన్ నటించింది.
దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన ఈ మూవీ లో ఊర్వసి రౌటేలా ఒక స్పెషల్ సాంగ్ లో నటించగా , బాబీ సింహ , ప్రకాష్ రాజ్ ఇతర ముఖ్యపాత్రలలో నటించారు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని నిన్న అనగా జనవరి 13 వ తేదీన భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేశారు. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజే బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ టాక్ లభించింది. దానితో ప్రస్తుతం ఈ మూవీ కి అదిరిపోయే రేంజ్ లో కలెక్షన్ లు కూడా వస్తున్నాయి. ఇది ఇలా ఉంటే రెండవ రోజు కూడా ఈ మూవీ కి అద్భుతమైన కలెక్షన్ లు వచ్చే అవకాశాలు ఉండడంతో ఈ మూవీ కి అదిరిపోయే రేంజ్ లో థియేటర్ లను ఈ మూవీ యూనిట్ కేటాయించినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ సంక్రాంతి కానుకగా విడుదల అయిన వీర సింహారెడ్డి ... తెగింపు ... వారసుడు ... కళ్యాణం కమనీయం సినిమాల అన్నింటికంటే కూడా వాల్తేరు వీరయ్య సినిమా ఎక్కువ థియేటర్ లలో ప్రదర్శించబడుతున్నట్టు తెలుస్తుంది. ఈ మూవీ ఈ రోజు 600 థియేటర్ లలో ప్రదర్శించబడుతున్నట్లు సమాచారం. దీనితో ఈ సినిమాకు ఈ రోజు మిగతా మూవీ లతో పోలిస్తే ఎక్కువ కలెక్షన్ లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.