మొదటిరోజు సీడెడ్ లో ఏకంగా అన్ని కోట్ల కలెక్షన్లను సాధించిన వీర సింహారెడ్డి మూవీ..!

Pulgam Srinivas
నందమూరి నట సింహం బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బాలకృష్ణ ఇప్పటికే ఎన్నో బ్లాక్ బాస్టర్ మూవీ లలో హీరోగా నటించి ఎన్నో బ్లాక్ బస్టర్ విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకోవడం మాత్రమే కాకుండా తన సినిమాల ద్వారా ఎంతో మంది అభిమానుల మనసు కూడా దోచుకున్నాడు.

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న సీనియర్ హీరోలలో ఒకరు అయినటువంటి బాలకృష్ణ తాజాగా వీర సింహా రెడ్డి అనే పవర్ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించాడు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ ని మైత్రి సంస్థ నిర్మించగా ... తమన్ ఈ మూవీ కి సంగీతం అందించాడు. ఈ మూవీ లో వరలక్ష్మి శరత్ కుమార్ ఒక కీలకమైన పాత్రలో నటించగా ,  దునియా విజయ్ విలన్ పాత్రలో నటించాడు. తమన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి 12 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేసిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ యూనిట్ ఈ సినిమా విడుదలకు ముందు ఈ మూవీ నుండి విడుదల చేసిన ప్రచార చిత్రాలు ... పాటలు అద్భుతంగా ఉండడంతో ఈ మూవీ పై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. అలా భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ మొదటి రోజు సీడెడ్ లో అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లను వసూలు చేసింది. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు 6.55 కోట్ల కలెక్షన్ లు దక్కాయి. దీనిలో 1.51 కోట్లు ఈ మూవీ కి వచ్చిన హైయర్స్. ఇలా మొదటి రోజు సీడెడ్ ఏరియాలో వీర సింహా రెడ్డి మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ ల వర్షం కురిపించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: