అయ్యో! బాలయ్య పరువు పోయిందిగా...!!
తెలుగు రాష్ట్రాల్లో ఎలా అయితే నందమూరి అభిమానులు సందడి చేశారో అదే విధంగా అమెరికా లో కూడా నందమూరి ఫ్యాన్స్ సందడి చేసేందుకు ప్రయత్నించారటా. తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల వద్ద ఎలా అయితే కాగితాలు చించి వేస్తారో అలాగే అక్కడ కూడా అభిమానులు చించి తెర మీద వేశారు. దాంతో చాలా మంది అక్కడి వారు ఇబ్బందులకు గురయ్యారని సమాచారం.. నందమూరి ఫ్యాన్స్ అమెరికాలో ని ఒక థియేటర్లో పేపర్స్ పెద్ద ఎత్తున వేయడం తో ఏకంగా థియేటర్ యాజమాన్యం షో ఆపి ఫ్యాన్స్ హెచ్చరించాల్సి వచ్చిందని సమాచారం.
నందమూరి బాలకృష్ణ యొక్క అభిమానులను థియేటర్ యాజమాన్యం మరియు పోలీసు లు హెచ్చరిస్తున్న ఈ వీడియో సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతుంది. దేశ వ్యాప్తంగా సినీ ప్రేమికులు ఈ విషయమై విమర్శలు కూడా చేస్తున్నారు. ఇండియన్ సినిమా థియేటర్స్ లో అయితే పర్వాలేదు కానీ అమెరికా లోని థియేటర్స్ లో ఇలా చేయడం వల్ల మన ఇండియన్ ప్రేక్షకుల పరువు పోతుందని అసంతృప్తి వ్యక్తం చేశారని సమాచారం.బాలకృష్ణ పై అభిమానం ఉండొచ్చు గాక ఆ అభిమానాన్ని మరో విధంగా చూపించుకుంటే ఎంతో బాగుంటుంది. కానీ ఇలా న్యూసెన్స్ క్రియేట్ చేసి ఇతర ప్రేక్షకులను ఇబ్బంది పెట్టే లా చేయవద్దని అమెరికన్ పోలీసులు కూడా తెలుగు ప్రేక్షకులకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. నందమూరి అభిమానులు చేసిన రచ్చ కు కొందరు ఫ్యాన్స్ మాత్రం హర్షం వ్యక్తం చేస్తుంటే కొందరు మాత్రం విమర్శల కు గుప్పిస్తున్నారని తెలుస్తుంది.