మెగాస్టార్ చిరంజీవి తాజాగా వాల్తేరు వీరయ్య మూవీలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. బాబి దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ లో రవితేజ ఒక కీలకమైన పాత్రలో నటించగా ... దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. మైత్రి సంస్థ నిర్మించిన ఈ మూవీ లో శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా ... కేథరిన్ ఒక కీలకమైన పాత్రలో నటించింది. బాబీ సింహ ... ప్రకాష్ రాజ్ ఈ మూవీ లో ఇతర ముఖ్య పాత్రలలో నటించారు.
ఈ మూవీ ని జనవరి 13 వ తేదీన భారీ ఎత్తున ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ మూవీ నుండి చిత్ర బృందం కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేయగా వాటికి ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభించింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో నిన్న ఈ మూవీ యూనిట్ భారీ ఎత్తున వైజాగ్ లో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించింది.
ఈ మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ ... మైత్రి మూవీ సంస్థ వారు ఈ సంక్రాంతి కి విడుదల చేయబోతున్న వీర సింహా రెడ్డి మరియు వాల్తేరు వీరయ్య మూవీ లు రెండు కూడా పెద్ద విజయాలను సాధించాలి అని వైజాగ్ సాక్షిగా మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అని చెప్పుకొచ్చాడు. ఇది ఇలా ఉంటే బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన వీర సింహా రెడ్డి మూవీ ని జనవరి 12 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ రెండు మూవీ లపై కూడా ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇలా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు కలిగి ఉన్న ఈ రెండు మూవీ లను కూడా మైత్రి మూవీ సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మించింది.