ఆభాద్యతల నుండి తప్పుకున్న కొరటాల శివ !
పరాజయం అన్నపదం ఒక మనిషిని ఏవిధంగా కన్ఫ్యూజ్ చేస్తుంది అన్నవిషయానికి ప్రత్యక్ష ఉదాహరణ కొరటాల శివ. సక్సస్ తప్ప ఫెయిల్యూర్ అన్నపదం అతడికి ‘ఆచార్య’ విడుదల అయ్యేంతవరకు అనుభవంలోకి రాలేదు. అయితే సక్సస్ ఫుల్ దర్శకుడుగా ఎన్నో ప్రశంసలు అందుకున్న కొరటాల శివ గౌరవాన్ని ‘ఆచార్య’ ఫెయిల్యూర్ పూర్తిగా తుడిచేసింది.
సోషల్ మీడియాలో కొరటాల శివ పై జరిగినంత ట్రోలింగ్ మరే టాప్ దర్శకుడు పైనా ఈమధ్య కాలంలో జరగలేదు అంటే అతిశయోక్తి కాదు. దీనితో జూనియర్ ఎన్టీఅర్ కొరటాల శివతో చేయవలసిన తన సినిమాకు సంబంధించి తారక్ కొరటాల శివకు పెట్టిన పరీక్షలలో చిట్టచివరకు కొరటాల జూనియర్ దగ్గర మంచి మార్కులు వేయించుకావడంతో ఎట్టకేలకు జూనియర్ తో తీయబోతున్న మూవీ షూటింగ్ ను వచ్చేనెల ఫిబ్రవరి నుండి మొదలుపెడతాము అని అధికారికంగా లీకులు ఇస్తున్నప్పటికీ ఆలీకులను తారక్ అభిమానులు పూర్తిగా నమ్మడంలేదు అన్న టాక్ కూడ నడుస్తోంది.
గత కొన్ని సంవత్సరాలుగా కొరటాల తన సినిమాకు దర్శకత్వం వహిస్తూనే ఆసినిమాల మార్కెటింగ్ ను కూడ చూస్తూ తాను దర్శకత్వం వహించే సినిమాకు పారితోషికంతో పాటు సినిమాకు జరిగిన బిజినెస్ లో కొంత శాతం వాటా కూడ తీసుకోవడం కొరటాల తన అలవాటుగా పెట్టుకున్నాడు అని అంటారు. కొరటాలకు సినిమా బయ్యర్లతో ఉన్న పరిచయాలతో తాను దర్శకత్వం వహించే సినిమాకు మంచి బిజినెస్ తేవడంలో చాల సిద్దహస్తుడుగా మారాడు.
‘ఆచార్య’ మూవీ స్థాయికి మించి బిజినెస్ చేయడంలో శ్రద్ధ చూపించిన కొరటాల ఆబిజీలో పడి ‘ఆచార్య’ కథ విషయమై పూర్తిగా శ్రద్ధ పెట్టలేక పోయాడు అన్న విమర్శలు కూడ వచ్చాయి. దీనితో త్వరలో జూనియర్ తో మొదలుకాబోతున్న భారీ మూవీ ప్రాజెక్ట్ కు సంబంధించి కేవలం దర్శకత్వ బాధ్యతలు తప్ప మరే విషయంలోనూ ముఖ్యంగా సినిమా మార్కెటింగ్ విషయంలో ఎటువంటి శ్రద్ధ తీసుకోవలసిన అవసరం లేదని ఆ బాధ్యతలు అన్నీ తాను నిర్వర్తిస్తానని ఈసినిమాకు సమర్పకుడుగా వ్యవహరిస్తున్న కళ్యాణ్ రామ్ కొరటాల కు స్పష్టమైన సూచనలు ఇచ్చాడు అంటూ ఇండస్ట్రీ వర్గాలలో గుసగుసలు వినిపిస్తున్నాయి..