ప్రభాస్ - సమంత కాంబోలో ఒక్క సినిమా లేదు. కారణం అదేనా?

praveen
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో పాన్ ఇండియా స్టార్ గా కొనసాగుతూ ఉన్నాడు ప్రభాస్. బాహుబలి తర్వాత ఇక వందల కోట్ల బడ్జెట్ సినిమాలని చేసుకుంటూ దూసుకుపోతూ ఉన్నాడు అని చెప్పాలి.  ఇక అతని డేట్స్ కోసం దర్శక నిర్మాతలు అందరూ కూడా ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు అని చెప్పడంలోనూ అతిశయోక్తి లేదు. అయితే ప్రభాస్ ఇప్పుడు వరకు ఎంతో మంది హీరోయిన్లతో నటించాడు.
ఇక ప్రతి ఒక్క హీరోయిన్ కూడా అటు ప్రభాస్కు పర్ఫెక్ట్ జోడి అని పేరు సంపాదించుకుంది. కానీ టాలీవుడ్ లో దశాబ్ద కాలం నుంచి స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న సమంతతో..మాత్రం అటు ప్రభాస్ ఒక్క సినిమాలో కూడా కలిసి నటించలేదు. అయితే ఒకవైపు ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా కొనసాగుతుండగా.. సమంత సైతం అదే రేంజ్ లో క్రేజ్ సంపాదించుకొని వరుస సినిమాలతో దూసుకుపోతుంది.  ఫ్యామిలీ మెన్ 2 వెబ్ సిరీస్ ద్వారా నార్త్ లో కూడా ఫాన్స్ ని సంపాదించుకుంది. ఉ అంటావా ఐటెం సాంగ్ తో పాన్ ఇండియా రేంజ్ లో పాపులారిటీ సొంతం చేసుకుంది.

 అలాంటి వీరి కాంబినేషన్ లో ఇప్పటివరకు ఒక్క సినిమా రాలేదు. దీంతో వీరికి కాంబినేషన్ కోరుకుంటున్నారు ఫ్యాన్స్. అయితే వీరిద్దరి కాంబో సెట్ కాకపోవడం వెనక ఒక బలమైన కారణం ఉందట. సాధారణంగా ప్రభాస్ ఎత్తుగా ఉంటాడు.  దాదాపు ఆయన హైట్ ఆరడుగుల పై మాటే. కానీ సమంత మాత్రం చాలా పొట్టిగా ఉంటుంది. ప్రభాస్ పక్కన హీరోయిన్ అంటే దాదాపు ఐదున్నర అడుగుల వరకైనా ఉండాలి. సమంత మాత్రం అంత హైట్ లేదు. దీంతో ఇక ప్రభాస్ పక్కన హైట్ సెట్ అవదు అనే కారణం తోనే దర్శక నిర్మాతలు ఎవరు కూడా ప్రభాస్ సరసన సమంతను ట్రై చేయలేదట. అందుకే వీరి కాంబినేషన్ లో ఇప్పటివరకు సినిమా రాలేదట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: