సౌత్ ఇండియన్ మూవీకి అరుదైన గౌరవం..!

Divya
సౌత్ ఇండియన్ సినిమాలు అంతర్జాతీయ స్థాయి లో సత్తా చాటుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్ నామినేషన్ కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే షార్ట్ లిస్టులో కూడా ఈ సినిమా పేరును చేర్చడం జరిగింది. ఇప్పుడు మరో సౌత్ ఇండియన్ మూవీకి అరుదైన గౌరవం లభించింది. తమిళ స్టార్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన భారీ బడ్జెట్ పౌరాణిక చిత్రం పొన్నియన్ సెల్వన్ -1.. ఈ సినిమా విడుదల అయ్యి ఏ స్థాయిలో విజయం సాధించిందో ప్రతి ఒక్కరికి తెలుసు. అయితే తాజాగా ఈ సినిమా మరో అరుదైన అవార్డును సొంతం చేసుకుంది.

ఇప్పుడు ఈ సినిమా 16వ ఏషియన్ ఫిలిం అవార్డ్స్ లో ఏకంగా ఆరు నామినేషన్లు పొందడం గమనార్హం.  ఈ విషయాన్ని ప్రొడక్షన్ హౌస్ అధికారికంగా ప్రకటించింది.  ఉత్తమ ఎడిటింగ్.. ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్.. ఉత్తమ చిత్రం.. ఉత్తమ ఒరిజినల్ సంగీతం.. ఉత్తమ ఛాయాగ్రహణం మరియు ఉత్తమ కాస్టింగ్ డిజైన్ విభాగాల్లో నామినేషన్ దక్కించుకుంది. ఐశ్వర్యారాయ్,  త్రిష , చియాన్ విక్రమ్ , కార్తీ,  జయం రవి వంటి భారీ తారాగణంతో రూపొందిన ఈ సినిమాకి ఇలా ఆరు విభాగాలలో కనీసం మూడు అవార్డులైన లభించే అవకాశం కనిపిస్తోంది.
మొదటి పార్ట్ గత ఏడాది సెప్టెంబర్ లో విడుదలవగా ఇప్పుడు రెండవ పార్ట్ ను ఏప్రిల్ 28న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.  మొదటి పాటతో పోల్చితే రెండవ పార్ట్ అంతకుమించి వసూలు నమోదు చేసే అవకాశాలు ఉన్నాయి అంటూ యూనిట్ సభ్యులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.  మరి ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో ప్రేక్షకులను ఆకట్టుకోవడం ఖాయం అంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి అయితే సౌత్ ఇండియన్ మూవీకి ఇలాంటి అరుదైన గౌరవం దక్కడం నిజంగా ప్రశంసనీయమని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: