కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్న
దళపతి విజయ్ ఇప్పటికే తాను నటించిన ఎన్నో
మూవీ లను తెలుగులో కూడా డబ్ చేసి విడుదల చేసి
టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును సంపాదించుకున్న విషయం మన అందరికీ తెలిసిందే.
విజయ్ టాలెంటెడ్
డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో రూపొందిన తుపాకీ
మూవీ ద్వారా తెలుగు
సినిమా ఇండస్ట్రీలో మంచు గుర్తింపును సంపాదించుకున్నాడు. ఈ
సినిమా టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లను రాబట్టింది.
తుపాకీ
మూవీ ద్వారా మంచి గుర్తింపును తెలుగు
సినిమా ఇండస్ట్రీలో సంపాదించుకున్న
విజయ్ ఆ తర్వాత నుండి దాదాపు తాను నటించిన ప్రతి
మూవీ ని కూడా తెలుగులో విడుదల చేసి తన క్రేజ్ ను
టాలీవుడ్ మార్కెట్ వద్ద మరింతగా పెంచుకున్నాడు విజయ్ ఆఖరుగా బీస్ట్ అనే
మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. ఈ
మూవీ కూడా తెలుగులో విడుదల అయింది. బీస్ట్
మూవీ కి
టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే రేంజ్ లో కలెక్షన్ లు దక్కాయి. తాజాగా
విజయ్ "వారిసు" అనే
తమిళ మూవీ లో హీరోగా నటించాడు. ఈ
మూవీ ని తెలుగులో వారసుడు పేరుతో విడుదల చేయనున్నారు.
వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందిన ఈ
మూవీ ని దిల్ రాజు నిర్మించగా ...
రష్మిక మందన ఈ
మూవీ లో
హీరోయిన్ గా నటించింది.
జనవరి 11 వ తేదీన ఈ
మూవీ ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఇది ఇలా ఉంటే ఈ
మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 16 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తుంది.
విజయ్ కెరియర్ లో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ
మూవీ కే అత్యధిక ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది.