మాస్ మహారాజా
రవితేజ పోయిన సంవత్సరం ఏకంగా మూడు
మూవీ లతో ప్రేక్షకులను పలకరించాడు.
క్రాక్ మూవీ తో అద్భుతమైన విజయాన్ని
బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్న
రవితేజ పోయిన సంవత్సరం మొదటగా
రమేష్ వర్మ దర్శకత్వంలో రూపొందిన ఖిలాడి
మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ
మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఆ తర్వాత
శరత్ మండువ దర్శకత్వంలో రూపొందిన రామారావు ఆన్ డ్యూటీ అనే
మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
ఈ
మూవీ కూడా మంచి అంచనల నడుమ విడుదల అయ్యి
బాక్స్ ఆఫీస్ దగ్గర గోరా పరాజయాన్ని అందుకుంది. ఇది ఇలా ఉంటే పోయిన సంవత్సరం
బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు పరాజయాలను ఎదుర్కొన్న
రవితేజ పోయిన సంవత్సరం చివరలో
డిసెంబర్ 23 వ తేదీన ధమాకా
మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. టాలెంటెడ్
డైరెక్టర్ త్రినాద్ రావు నక్కిన దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు బీమ్స్ సంగీతం అందించగా ... యంగ్
బ్యూటీ శ్రీ లీల ఈ
మూవీ లో
హీరోయిన్ గా నటించింది.
మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ
మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ఈ
మూవీ నిన్నటికే 100 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను కూడా వసూలు చేసింది. ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే ఈ వారం కూడా ఈ
మూవీ కి బాగా కలిసి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ వారం క్రేజ్ ఉన్న సినిమాలు ఏవి కూడా
థియేటర్ లలో విడుదల కావడం లేదు. దానితో ఈ వారం కూడా ధమాకా
మూవీ కి
బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన కలెక్షన్ లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.