తెలుగు
సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు కలిగిన
యువ హీరోలలో ఒకరు అయినటువంటి
రామ్ పోతినేని గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు.
రామ్ పోతినేని తాజాగా
తమిళ దర్శకుడు లింగుసామి దర్శకత్వంలో రూపొందిన ది
వారియర్ అనే
మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కృతి శెట్టి
హీరోయిన్ గా నటించిన ఈ
మూవీ లో
ఆది పినిశెట్టి విలన్ పాత్రలో నటించగా ... దేవి
శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందించాడు.
భారీ అంచనాల నడుమ తెలుగు మరియు
తమిళ భాషలలో విడుదల అయిన ఈ
మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ విజయం అందుకోలేక పోయింది. ఈ
మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించకపోయినప్పటికీ నటుడి గా మాత్రం
రామ్ కి ఈ
సినిమా మంచి గుర్తింపును తీసుకువచ్చింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ
యువ హీరో
టాలీవుడ్ మాస్ దర్శకులలో ఒకరు అయినటువంటి
బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న భారీ బడ్జెట్ పాన్
ఇండియా మూవీ లో నటిస్తున్నాడు.
ఇప్పటికే ఈ
మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యి కొంత భాగం షూటింగ్ కూడా పూర్తి అయింది. ఈ
మూవీ లో
రవితేజ సరసన
శ్రీ లీల
హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా ఈ ముద్దు గుమ్మ ఈ
సినిమా షూటింగ్ లో జాయిన్ అయింది. ఈ
మూవీ కనక విజయం సాధించినట్లు అయితే
శ్రీ లీల కు పాన్
ఇండియా రేంజ్ లో మంచి గుర్తింపు లభించే అవకాశం ఉంది. ఇది ఇలా ఉంటే ఈ
మూవీ లో
ఊర్వశి రోటేలా ఒక స్పెషల్ సాంగ్ లో కనిపించనుంది. ఈ
మూవీ రామ్ కు
బోయపాటి శ్రీను కు మొట్ట మొదటి పాన్
ఇండియా మూవీ కావడం విశేషం.