తెలుగు సినిమా ఇండస్ట్రీలో అద్భుతమైన క్రేజ్ ఉన్న నటులలో ఒకరు అయినటు వంటి శ్రీకాంత్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. శ్రీకాంత్ తన కెరియర్ లో ఎన్నో మూవీ లలో విలన్ గా నటించి ... ఆ తర్వాత హీరోగా అద్భుతమైన విజయాలను అందుకొని ప్రస్తుతం కూడా విలన్ గా మరియు ఇతర పాత్రల్లో నటిస్తూ ఫుల్ జోష్ లో తన కెరీర్ ను ముందుకు సాగిస్తున్నాడు.
అందులో భాగంగా కొంత కాలం క్రితం శ్రీకాంత్ ... బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన అఖండ మూవీ లో ప్రతినాయకుడి పాత్రలో నటించి ప్రేక్షకులను అలరించాడు. ఈ మూవీ లో శ్రీకాంత్ నటనకు గాను ప్రేక్షకుల నుండి ... విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు లభించాయి. ఇది ఇలా ఉంటే తాజాగా శ్రీకాంత్ తమిళ సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి తలపతి విజయ్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందిన వారసుడు మూవీ లో కీలకమైన పాత్రలో నటించాడు. ఈ మూవీ ఈ సంవత్సరం జనవరి 12 వ తేదీన విడుదల కాబోతుంది.
ఈ మూవీ విడుదల సందర్భంగా తాజాగా ఇంటర్వ్యూలో మాట్లాడిన శ్రీకాంత్ ఈ మూవీ కి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చాడు. వారసుడు మూవీ అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఈ మూవీ లో అద్భుతమైన హ్యూమన్ ఎమోషన్స్ ఉన్నాయి. ఇది ఒక దృశ్య కావ్యం లాంటిది. ఈ సినిమాలో నేను విజయ్ కి సోదరుడు పాత్రలో కనిపించబోతున్నాను. అని శ్రీకాంత్ తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. దిల్ రాజు నిర్మించిన ఈ మూవీ లో రష్మిక మందన హీరోయిన్ గా నటించగా ... తమన్ ఈ మూవీ కి సంగీతం అందించాడు.