నటి ప్రగతి మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అందరికి గుర్తుకు వస్తుంది. రెండు దశాబ్దాల కాలంలో ప్రగతి అమ్మగా మరియు అత్తగా వందల చిత్రాల్లో అయితే నటించారు.
ఈ జనరేషన్ వాళ్లకు అమ్మ అంటే గుర్తొచ్చేది ప్రగతినే. అటు మోడ్రన్ ఇటు మిడిల్ క్లాస్ రోల్స్ కి కూడా నటి ప్రగతి బాగా సరిపోతారు.తనదైన నటన ఆమెను బిజీ ఆర్టిస్ట్ గా అయితే చేశాయి. అయితే ప్రగతి కెరీర్ స్టార్ట్ అయ్యింది ఒక హీరోయిన్ గా అని చాలా మందికి కూడా తెలియదు. 1994లో విడుదలైన 'వీటిలే విశేషంగా' అనే తమిళ చిత్రంతో హీరోయిన్ గా ఆమె వెండితెరకు పరిచయం అయింది.. 1997 వరకు ఆమె హీరోయిన్ రోల్స్ కూడా చేశారు. అయితే చేసింది మాత్రం తక్కువ చిత్రాలే.
1997లో వివాహం చేసుకున్న ప్రగతి కొన్నేళ్లు పరిశ్రమకు దూరంగా వున్నారు.. 2002లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సెకండ్ ఇన్నింగ్స్ ను కూడా స్టార్ట్ చేశారు. ఆ ఏడాది విడుదలైన బాబీ మూవీలో మహేష్ తల్లి పాత్ర ను చేశారు. అప్పటికి ఆమె వయసు దాదాపు 27 ఏళ్ళు. మహేష్ కి సమానమైన వయసులో ఆయనకు తల్లిగా అయితే చేసింది. ఆమె సెకండ్ ఇన్నింగ్స్ కూడా సూపర్ సక్సెస్ అయింది . ఏడాదికి పదుల సంఖ్యలో సినిమాలు చేస్తూ ఎంతో బిజీ ఆర్టిస్ట్ గా ఉన్నారు. తాను తీసుకున్న తప్పుడు నిర్ణయాలు ఆమె కెరీర్ ని దెబ్బతీశాయని ప్రగతి ఎప్పుడు అంటారు.
ముఖ్యంగా ఎర్లీ మ్యారేజ్ నా జీవితాన్ని 10 నుండి 20 ఏళ్ళు వెనక్కి లాగేసిందని కూడా ఆమె చెబుతుంది. హీరోయిన్ గా కొనసాగుతున్న సమయంలో నేను తప్పక పెళ్లి చేసుకున్నాను. అది కెరీర్ మీద చాలా ప్రభావం చూపిందని ప్రగతి అభిప్రాయపడ్డారు. పెళ్లి నిర్ణయం వెనుక అమాయకత్వం, మూర్ఖత్వం, నాకు అన్నీ తెలుసు అనే అహం కూడా ఉన్నాయి. పరిస్థితులు కల్పించుకొని మరీ మనం అనుకున్నది జరగాలని మనం అనుకుంటాము. చేసింది తప్పని తెలుసుకొని బయటకు రావడం కూడా అంత సులభం కాదని ఆమె అన్నారు
నేను క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఉన్నప్పుడు కెరీర్ పై ఎంత ఫోకస్ పెట్టానో.. అంత ఫోకస్ హీరోయిన్ గా ఉన్నప్పుడు కనుక పెడితే నా జీవితం వేరుగా ఉండేది. సరైన టైములో సరైన డెసిషన్ తీసుకోకపోతే అందుకు మూల్యం చెల్లించక తప్పదని ప్రగతి చెప్పుకొచ్చారు.