అయితే గత కొంతకాలం నుంచి కూడా
టాలీవుడ్,
బాలీవుడ్ ల మధ్య ఉన్న సరిహద్దులు చెరిగిపోతున్నాయి. కేవలం
టాలీవుడ్ నుంచి మాత్రమే కాదు.. సౌత్ నుంచి అన్ని వుడ్స్ కి సంబంధించిన అనేకమంది నటులు కూడా ఇప్పుడు వరుసగా పాన్-ఇండియా సినిమాలలో నటిస్తున్నారు.నార్త్
ఆడియన్స్ ని మన నటులు తమ నటనతో ఎంతగానో ఆకట్టుకుంటున్నారు. ఇంకా అలాగే మరోవైపు చాలా మంది బి-టౌన్ స్టార్ హీరోలు కూడా సౌత్ లో కనిపించడానికి ఎంతగానో ఆసక్తి చూపిస్తున్నారు. ఈమధ్య
rrr సినిమాతో
జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ ప్రేక్షకులను చాలా బాగా ఆకట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో
జూనియర్ ఎన్టీఆర్ తన తరువాత సినిమాలో
మిస్టర్ పర్ఫెక్షనిస్ట్
అమీర్ ఖాన్ నటించనున్నాడు అనే టాక్ ఫిల్మ్
నగర్ లో బాగా వైరల్ అవుతుంది.
kgf ఫేమ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తన తరువాత సినిమాలో
ఎన్టీఆర్ తో
అమీర్ ఖాన్ స్క్రీన్ నటించబోతున్నాడట..ఇక ఇదే విషయంపై అమీర్ ఖాన్ ను సంప్రదించగా ఎప్పటి నుంచో ఓ మంచి తెలుగు చిత్రాన్ని చేసేందుకు చూస్తున్న
అమీర్ ఖాన్ ఇక ఛాన్స్ రాగానే ఓకే చెప్పారని బీ టౌన్లో కూడా సమాచారం తెలుస్తుంది.
యంగ్ టైగర్
జూనియర్ ఎన్టీఆర్ కొత్త మూవీకి తాత్కాలికంగా
ఎన్టీఆర్ 31 అని పేరు పెట్టారు. ఈ మూవీకి మేకర్స్
జూనియర్ ఎన్టీఆర్ తో పోరాడే విలన్ రోల్ కోసం ఇప్పుడు అమీర్ ఖాన్‌ను అనుకుంటున్నారట. ఈ
సినిమా సెట్స్ పైకి కూడా త్వరలో వెళ్లే అవకాశం ఉంది.ఇప్పటి దాకా మూవీకి మూవీకి మధ్య ఎక్కువ సమయం ఇవ్వని యంగ్ టైగర్ ఎన్టీఆర్..
ఆర్.ఆర్.ఆర్ సినిమా తర్వాత మాత్రం షూటింగ్‌కు గ్యాప్ ని ఇచ్చేశాడు. ప్రీ ప్రొడక్షన్ పనే కారణమో లేదా తనకు రెస్ట్ కావాలనుకున్నాడో తెలియదు కాని
కొరటాల సినిమా షూటింగ్‌ను చాలా కాలమే పక్కకు పెట్టేశాడు తారక్.తన ఫ్యామిలీతో టూర్ లకి వెళుతూ ఆ ఫోటోలతో నెట్టింట ట్రెండ్ అవుతున్నారు. ఇక తన అప్డేట్స్ కావాలని బెట్టు చేస్తున్న అభిమానులకు మాత్రం తాజాగా స్వీట్ సర్ ప్రైజ్ ఇచ్చేశాడు తారక్.
కొరటాల తో తాను చేయబోయే షూటింగ్‌ను
ఫిబ్రవరి నెలలో ఫస్ట్ వీక్ నుంచి స్టార్ట్ చేస్తున్నట్టు.. ఓ అనౌన్స్ మెంట్ కూడా చెయ్యడం జరిగింది.