నొప్పితో విలవిలలాడుతూ డాన్స్ చేశా... ప్రముఖ నటి..!

Pulgam Srinivas
నందమూరి నట సింహం బాలకృష్ణ తాజాగా వీర సింహా రెడ్డి అనే మాస్ మసాలా కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ లో శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా ... మైత్రి మూవీ  బ్యానర్ వారు ఈ మూవీ ని భారీ బడ్జెట్ తో నిర్మించారు. వరలక్ష్మి శరత్ కుమార్ ఈ మూవీ లో ఒక కీలకమైన పాత్రలో కనిపించనుండగా ... దునియా విజయ్ ఈ మూవీ లో పవర్ ఫుల్ విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు.

ఎస్ ఎస్ తమన్ ఈ మూవీ కి సంగీతం అందించాడు. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి 12 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ సినిమా నుండి ఈ మూవీ యూనిట్ 3 పాటలను విడుదల చేసింది. ఈ మూడు పంటలకు కూడా ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభిస్తుంది. ఇది ఎలా ఉంటే కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ యూనిట్ ఈ సినిమా నుండి మా బావ మనోభావాలు అనే ఐటమ్ సాంగ్ ను విడుదల చేసింది.

ఈ ఐటమ్ సాంగ్ ప్రస్తుతం ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభిస్తుంది. ఈ సాంగ్ లో బాలకృష్ణ ... హాని రోసి ... చంద్రిక రవి లు నటించారు. ఈ ముగ్గురు ఈ సాంగ్ లో వేసిన స్టెప్ లకు ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభిస్తుంది. తాజాగా ఈ స్పెషల్ సాంగ్ లో నటించిన చంద్రిక రవి  కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. బాలకృష్ణ తో డాన్స్ చేయడం ఎప్పటికీ మరిచిపోలేను అని ... షూటింగ్ సమయంలో వెన్నుపూస బెణికింది అని ... ఆ నొప్పితో విలవిలలాడుతూ ఈ సాంగ్ చేశాను అని చంద్రక రవి చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: