18 పేజెస్ సక్సెస్ మీట్ కి సుకుమార్ ఎందుకు రాలేదు..?

Divya
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పటికే ఎంతోమంది హీరోలను మంచి స్టేజికి తీసుకెళ్లిన ఈయన కొన్ని సినిమాలకు రచయితగా కూడా పనిచేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే తాజాగా సుకుమార్ రచయితగా పనిచేసిన చిత్రం 18 పేజెస్.. గీత ఆర్ట్స్ 2 బ్యానర్ పై సుకుమార్ రచయితగా ఆయన శిష్యుడు సూర్య ప్రతాప్ పల్నాటి దర్శకత్వం వహించిన ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. కార్తికేయ 2 సినిమాతో మొదటి విజయాన్ని సొంతం చేసుకున్న నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంట ఇప్పుడు 18 పేజీస్ సినిమాతో కూడా మరొక విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.
ఈ జంట ఇప్పుడు హిట్ పెయిర్ గా గుర్తింపు తెచ్చుకోవడం గమనార్హం. ఇదిలా ఉండగా ఈ సినిమా సక్సెస్ మీట్ జరిగినప్పుడు సుకుమార్ , అల్లు అరవింద్ తో పాటు ప్రతి ఒక్కరు కూడా హాజరై ఉల్లాసంగా" టైం ఇవ్వు పిల్ల " అనే పాటకు స్టెప్పులు కూడా వేసి భారీగా తమ సక్సెస్ ను  ఎంజాయ్ చేశారు . అయితే ఇటీవల హైదరాబాదులోని ప్రముఖ హోటల్ దస్పల్లాలో మరొకసారి సక్సెస్ ఈవెంట్ నిర్వహించారు.. అయితే ఈవెంట్ కి సుకుమార్ రాకపోవడంతో ప్రతి ఒక్కరు ఏమైంది అనే విషయంపై ఆరా తీస్తున్నారు.
సుకుమార్ ప్రస్తుతం పుష్ప 2  సినిమా షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్నాడు.  ఈ కారణం చేతనే హైదరాబాదులోని ప్రముఖ హోటల్ దస్పల్లాలో జరిగిన సక్సెస్ మీట్ కి హాజరు కాలేదు అన్న వార్తలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.  ఏది ఏమైనా ఈ  సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న ఈ జంట మరొక సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారా లేక ఇక్కడితో ఈ జంట కాంబినేషన్ పులిస్టాప్ పెడుతుందా?  అనేది తెలియాల్సి ఉంది . మరొక పక్క అల్లు అర్జున్ తో సుకుమార్ పుష్ప 2  సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కిస్తూ సినిమాపై భారీ అంచనాలు పెంచేస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: