ఇంటిమేట్ సీన్లలో.. హీరోల బిహేవియర్ పై తమన్నా ఏమందంటే?
సాధారణంగా హీరోలు హీరోయిన్లతో రొమాన్స్ సీన్లు చేస్తున్నప్పుడు నిజంగా హీరోలు ఎంత అదృష్టవంతులు.. అంత అందమైన హీరోయిన్లతో రొమాన్స్ లో మునిగి తేలుతున్నారు అని అనుకుంటూ ఉంటారు కొంతమంది ప్రేక్షకులు. అయితే ఇక రొమాంటిక్ సీన్స్ చేసే సమయంలో కొంతమంది ఏకంగా మూడ్ లోకి వస్తారని తమను తాము కంట్రోల్ చేసుకోలేరని కూడా అప్పుడప్పుడు టాక్ వినిపిస్తూ ఉంటుంది. అయితే ఇలా రొమాంటిక్ సీన్లలో హీరోలు ఎలా ఉంటారు అన్న విషయంపై ఇటీవల మిల్కీ బ్యూటీ తమన్న షాకింగ్ కామెంట్స్ చేసింది. ముఖ్యంగా ఇంటిమేట్ సీన్లు చిత్రీకరణ చేస్తున్న సమయంలో హీరోలు ఎలా బిహేవ్ చేస్తారు అన్న విషయం బాగా తెలుసు అంటూ చెప్పుకొచ్చింది.
ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఒక్కటే సినిమాల్లో నటించేవారు కూడా మనుషులే అన్న విషయాన్ని తెలుసుకోవాలి. ఆడ లేదా మగ అనేదానితో సంబంధం లేకుండా ఇది ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. అయితే రొమాంటిక్ సన్నివేశాలప్పుడు కొంతమంది హీరోలు ఎంతో ఇబ్బందిగా ఫీల్ అవుతారు. మహిళలు ఏమనుకుంటారు అని అసౌకర్యంగా భావిస్తారు అంటూ ఇటీవల తమన్నా ఇంటర్వ్యూలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తమన్నా వ్యాఖ్యలు అందరి హీరోలకు వర్తించవని కొంతమంది హీరోలు ఎంతో ఆసక్తికరంగా హీరోయిన్లతో రొమాంటిక్ సీన్లు నటించడానికి ఇష్టపడతారని.. కానీ కొంతమంది హీరోలు మాత్రమే రొమాంటిక్ సీన్లు చేయడానికి ఇబ్బంది పడతారని కామెంట్లు చేస్తున్నారు నేటిజన్స్. ఇకపోతే సీనియర్ మంచి బ్యూటీ తమన్న ప్రస్తుతం వరుసపెట్టి సినిమాలతో బిజీ బిజీగా ఉంది అన్న విషయం తెలిసిందే.