తెలుగు మరియు తమిళ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటులలో ఒకరు అయినటువంటి సిద్ధార్థ్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే అనేక తెలుగు మూవీ లలో నటించి అందులో కొన్ని మూవీ లతో అద్భుతమైన విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకొని కొన్ని సంవత్సరాల పాటు టాలీవుడ్ ఇండస్ట్రీcలో అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరోగా కెరియర్ ను సిద్ధార్థ్ కొనసాగించాడు. ఆఖరిగా తెలుగులో సిద్ధార్థ్ "మహా సముద్రం" మూవీ లో హీరోగా నటించాడు.
ఈ మూవీ లో శర్వానంద్ కూడా హీరో గా నటించగా , అజయ్ భూపతి ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. అను ఇమాన్యుయల్ ... అదితీ రావ్ హైదరి ఈ మూవీ లో హీరోయిన్ లుగా నటించారు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర సిద్ధార్థ్ కు మంచి విజయాన్ని అందించలేక పోయింది. ఇది ఇలా ఉంటే సిద్ధార్థ్ అనేక తమిళ మూవీ ల ద్వారా కూడా మంచి విజయాలను అందుకొని తమిళ సినిమా ఇండస్ట్రీ లో కూడా అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే సిద్ధార్థ్ అప్పుడప్పుడు కొన్ని విషయాలపై తనదైన రీతిలో స్పందిస్తూ వార్తల్లో నిలిచిన సందర్భాలు కూడా ఉన్నాయి.
ఇ
ది ఇలా ఉంటే తాజాగా ఈ నటుడు తన తల్లిదండ్రులను ఎయిర్ పోర్ట్ సిబ్బంది వారు వేధించారు అంటూ సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు. ఎయిర్ పోర్ట్ సిబ్బంది వారు దాదాపు 20 నిమిషాల పాటు తన తల్లిదండ్రులను వేధించారు అని సిద్ధార్థ్ చెప్పుకొచ్చాడు. అలాగే వారి బ్యాగుల నుండి వస్తువులను తొలగించాలని ... ఇంగ్లీషులో మాట్లాడాలని అడుగుతున్నప్పటికీ వారితో హిందీ లో మాట్లాడి ఇబ్బంది పెట్టారు అని సిద్ధార్థ్ చెప్పుకొచ్చాడు.