"ఆర్సి 15" లేటెస్ట్ షూటింగ్ అప్డేట్ న్యూస్..!

Pulgam Srinivas
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రామ్ చరణ్ ఇప్పటికే ఎన్నో అద్భుతమైన బ్లాక్ బాస్టర్ మూవీలలో హీరోగా నటించి టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ సంవత్సరం ఇప్పటికే రామ్ చరణ్ "ఆర్ ఆర్ ఆర్" అనే భారీ బడ్జెట్ మూవీ తో ప్రేక్షకులను పలకరించి ... అద్భుతమైన విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్నాడు.


ఈ మూవీ ద్వారా రామ్ చరణ్ కు ప్రపంచవ్యాప్తంగా అదిరిపోయే రేంజ్ గుర్తింపు లభించింది. ప్రస్తుతం రామ్ చరణ్ ... శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. కియరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ లో అంజలి ... సునీల్ ఇతర ముఖ్య పాత్రలలో కనిపించనుండగా ,  ఎస్ జె సూర్య విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. టాలీవుడ్ ఇండస్ట్రీలో అద్భుతమైన క్రేజ్ ఉన్న నిర్మాతలలో ఒకరు అయినటువంటి దిల్ రాజు ఈ మూవీ ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తూ ఉండగా ,  సన్షేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ తమన్ ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నాడు.


ఇది ఇలా ఉంటే ఇప్పటివరకు ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు టైటిల్ ని ఫిక్స్ చేయలేదు. దానితో ఆర్సి 15 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీ చిత్రీకరణ ప్రస్తుతం జరుగుతుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ షూటింగ్ కు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ బయటకు వచ్చింది. ఈ మూవీ యొక్క తాజా షెడ్యూల్ ఈ నెల చివరన రామ్ చరణ్ లేకుండానే ప్రారంభం కాబోతున్నట్లు ... జనవరి ఫస్ట్ వీక్ తర్వాత రామ్ చరణ్ ఈ మూవీ షూటింగ్ లో జాయిన్ కాబోతున్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: